మేకిన్‌ ఇండియాను బుల్డోజర్‌ ఇండియాగా మార్చారు- ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఎంపీ అరవింద్‌ దొంగల సంఘానికి నాయకుడని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు.రాష్ట్ర బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లుడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 Make In India Bulldozer India Armor Mla Jeevan Reddy , Armor Mla , Jeevan Redd-TeluguStop.com

బండి సంజయ్‌ తొండి సంజయ్‌ అని చెప్పారు.అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసులో జీవన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్‌ రెండు రోజుల క్రితం సవాల్‌ విసిరారని, దానికి సమాధానమివ్వకుండా బీజేపీ ఎంపీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు.ఎంపీ అరవింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆయనకు మొదడు ఆగమైందన్నారు.

బీజేపీ ఎంపీలు రాష్ట్ర సమస్యల కోసం ఎన్నడూ కేంద్ర మంత్రులను కలవలేదని చెప్పారు.

మేకిన్‌ ఇండియాను బుల్డోజర్‌ ఇండియాగా మార్చారని విమర్శించారు.తెలంగాణలో బీజేపీపై రాజకీయ బుల్డోజర్లు ఎక్కిస్తామన్నారు.

విపక్ష నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తరిమి కొడతామని హెచ్చరించారు.

గజదొంగకు కాంగ్రెస్‌ పీసీసీ పగ్గాలిచ్చిందని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు తెలంగాణలో ఏమి చెప్పానా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

సీఎం కేసీఆర్‌ది అభివృద్ధి గానం కాగా, కాంగ్రెస్‌, బీజేపీలది వక్రమార్గమని ఎద్దేవా చేశారు.అభివృద్ధిలో తెలంగాణది అగ్రభాగమని అందుకే ప్రతిపక్షాలది అసహన రాగమన్నారు.

కేసీఆర్‌ను ఎంత తిట్టినా హనుమంతుడి ముందు కుప్పిగంతులే అనే విషయాన్ని గ్రహించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube