తెలుగు సినీ ప్రేక్షకులకు సీరియల్ నటి మహేశ్వరి ( Actress Maheshwari )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మహేశ్వరి.
ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమైన వదినమ్మ సీరియల్( Vadinamma serial ) తో భారీగా పాపులర్ రిటన్ సంపాదించుకుంది.ఎక్కువ శాతం ఈమె సీరియల్స్ లో నెగటివ్ పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.
ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో రీల్స్ యూట్యూబ్ వీడియోస్ ( YouTube videos ) ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరువగా ఉంటుంది మహేశ్వరి.
ముఖ్యంగా తన భర్తతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా భారీగా డబ్బులు సంపాదిస్తోంది.
సొంతంగా ఛానల్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ విషయాలను వీడియోల ద్వారా జనాలతో షేర్ చేసుకుంటున్నారు.బుల్లితెర నటి మహేశ్వరి కూడా అదే చేసింది.ఆమె భర్త శివనాగ్ ( Shivanag )ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేస్తున్నాడు.ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది.
త్వరలో ఆమెతో ఆడుకోవడానికి ఒక బుజ్జి పాపాయి రానుంది.మహేశ్వరి ప్రస్తుతం ప్రెగ్నెంట్.
దీంతో ఆమెకు ఏదైనా మంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు శివ.ఇంకేముంది, సీమంతం వేడుక ప్లాన్ చేశాడు.

భార్యకు తెలియకుండానే సీమంతం వేడుకకు( Seemantam ceremony ) కావాల్సినవన్నీ సమకూర్చాడు.భార్య, కూతురికి అవసరమయ్యే షాపింగ్ కూడా చేశాడు.బోటింగ్‌కు వెళ్తున్నాం అని చెప్పి వారిని నేరుగా ఒక ఈవెంట్ హాల్‌కు తీసుకెళ్లాడు.అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కనిపించడంతో షాకైంది నటి.ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తనను రెడీ చేసి సీమంతం చేశారు.ఈ సర్‌ప్రైజ్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి.
ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.అనంతరం మహేశ్వరి- శివ కేక్ కట్ చేశారు.
ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించారు.

భార్య పొట్టకు ముద్దుపెడుతున్న భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలుచున్నట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు.కేక్ కట్ చేయడంతో పాటు పనిలో పనిగా ఫోటోషూట్ కూడా చేశారు.ఈ సెలబ్రేషన్స్‌కు సిద్దార్థ్‌వర్మ – విష్ణుప్రియ, ఇంద్ర- మేఘన దంపతులు, యాంకర్ రవి హాజరయ్యారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం వ్యక్తం చేయడంతో పాటు మహేశ్వరి శివ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.