మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి అందరికి తెలిసిందే.ఆయన ఒకపక్క బిజినెస్ లో బిజీ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో కూడా అదే యాక్టివ్ నెస్ చూపిస్తూ ఉంటారు.
రోజూ రక రకాల ట్వీట్స్ చేస్తూ నెటిజన్ల లో ఉత్సాహం నింపుతూ ఉంటారు.అయితే అలాంటి మహీంద్రా తాజాగా ఒక బామ్మకు సాయం అందించారు.
తమిళనాడుకు చెందిన కమలాదళ్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీ లు విక్రయిస్తుంది.రూపాయికే ఆమె ఇడ్లీలు విక్రయిస్తూ పేదల కడుపు నింపుతుంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రసంశలు కురిపిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు కట్టెల పొయ్యి మీదే ఇడ్లీలు వండి అమ్ముతుంది అన్న విషయం తెలుసుకున్న మహీంద్రా దీనిపై స్పందించి మీకు ఆమె వివరాలు తెలిస్తే నాకు చెప్పండి.ఆమె వ్యాపారానికి పెట్టుబడి పెట్టి గ్యాస్ స్టవ్ కొనిస్తా అంటూ ట్వీట్ చేశారు.
దీనితో స్పందించిన నెటిజన్లు వెంటనే రీ ట్వీట్ చేస్తూ కమలా దళ్ వివరాలను అందించారు.

అలానే మహీంద్రా ట్వీట్ పై ‘ఇండియన్ ఆయిల్’ సంస్థ కూడా స్పందించింది.‘‘సరిగ్గా చెప్పారు.ఇండియన్ ఆయిల్ దేశానికి ఏ స్ఫూర్తితో సేవలను అందిస్తుందో.
ఆమె కూడా ఆవిధంగానే సమాజ సేవ చేస్తోంది.అలాంటి వారికి మా మద్దతు ఉంటుంది.
ఆ అవ్వకు ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందిస్తాం అని తెలిపి ముందుకు వచ్చి ఆమెకు సాయం అందించినట్లు తెలుస్తుంది.