తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 వారాలు ముగుస్తున్నా కొద్ది షోపై ఆసక్తి తగ్గిపోతుంది.మొదటి వారం రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ దక్కింది.
ఎనిమిదవ వారంలో కూడా బిగ్‌బాస్‌కు రికార్డు స్థాయిలోనే రేటింగ్ వచ్చింది.కాని గతంలో ఎప్పుడు రానంత తక్కువ స్థాయి రేటింగ్ రావడంతో చెత్త రికార్డును మూట కట్టుకుంది.
బిగ్‌బాస్ సీజన్ 3లోని టాస్క్‌లు అన్ని కూడా అత్యంత చెత్త టాస్క్‌లు అంటూ ప్రేక్షకులు మొదటి నుండి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఒకట్టి అయినా మంచి ఎంటర్టైన్మెంట్ టాస్క్ కాదని, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేది లేదని అంటున్నారు.


తాజాగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇంట్లో దెయ్యం, నాకేం భయం.ఈ టాస్క్ ప్రేక్షకులకే కాకుండా ఇంటి సభ్యులకు కూడా చిరాకు తెప్పించింది.ఇంటి సభ్యులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది.అయితే ఇంటి సభ్యులు ఆడిన గేమ్ పరమ చెత్తగా ఉంది.ఒక్కరు ఇద్దరు తప్ప ఏ ఒక్కరు కూడా గేమ్ ఆడలేక పోయారు.ముఖ్యంగా పునర్నవి ఈ టాస్క్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
చెత్తగా టాస్క్ ఉందని, ఇంత చెత్త టాస్క్ ఏంటీ బిగ్‌బాస్ అంటూ విమర్శించింది.


తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో మొన్నటి వరకు ప్రేక్షకులు టాస్క్‌లు బాగాలేవంటూ విమర్శలు చేశారు.ఇప్పుడు ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులు కూడా టాస్క్‌లపై విమర్శలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గతంలో బిగ్‌బాస్ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉండవేమో.
టాస్క్‌ల విషయంలో ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ను విమర్శించడం ఇప్పుడే చూశాం.ప్రేక్షకులు మరియు ఇంటి సభ్యులు అంతా కూడా ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 3 టాస్క్‌లపై కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌తో రచ్చ రచ్చ అవుతోంది.