సరికొత్త కార్ల తయారీలో మహీంద్రా.. త్వరలో మార్కెట్‌లోకి..

ట్రాక్టర్ తయారీలో ప్రపంచంలోనే గొప్ప సంస్థగా పేరుగాంచింది మహీంద్రా కంపెనీ.ట్రాక్టర్ తయారీ ఒక్కటే కాదు ఎస్‌యూవీల తయారీలోనూ మహీంద్రాకు మంచి పేరుంది.

వెహికల్ మేకింగ్‌లో స్వదేశీ సంస్థగా చెరగని ముద్రే వేసిన మహీంద్రా కంపెనీ మరో ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకుంది.హైపర్ కారు తయారీకి పూనుకున్నట్లు పేర్కొంది.

మహీంద్రా కంపెనీ త్వరలో హైపర్ కార్స్‌ను తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతుంది.ఆటోమొబైల్ మార్కెట్‌లో దిగ్గజ సంస్థగా ఉన్న మహీంద్రా కంపెనీ తన బ్రాండ్ ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేయనుంది.

ఇప్పటికే తమ కంపెనీ నుంచి అన్ని రకాల వెహికల్స్ దొరకుతాయనే సంకేతాలు ఇచ్చింది మహీంద్రా కంపెనీ.ట్రాక్టర్స్, జీపులు ఇతర వాహనాలు మహీంద్రా బ్రాండ్ వి కొనుగోలు చేసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Advertisement

ఇక హైపర్ కార్ల తయారీ ద్వారా ఇంకా పేరు తెచ్చుకునేందుకు మహీంద్రా కంపెనీ ప్రయత్నిస్తోంది.ఈ హై ఎండ్‌ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో రెనాల్ట్‌, ఫోర్డ్‌‌తో కలిసి ముందుకు సాగాలని మహీంద్రా డిసైడ్‌ అయ్యింది.

ఇకపోతే మహీంద్రా కంపెనీ ఈ హైపర్ కార్ల తయారీ కోసం హైపర్ కార్సీ మేకింగ్‌లో పట్టున్న ఫినిన్‌ఫరినాతో జట్టు కట్టేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో త్వరలో మహీంద్రా, ఫినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్‌ కారుని మార్కెట్‌లోకి తీసుకొస్తాయి.

ఫినిన్‌ఫరినా ‘బటిస్టా’ అనే కాన్సెప్టుతో హైపర్ కారు తయారు చేసేందుకు 2019లోనే సిద్ధమైంది.కానీ, కొవిడ్ పరిస్థితుల వల్ల కారు తయారీ పనులు ఆగిపోయాయి.2022లో ఈ కారు రాబోతుండగా, కారు తయారీలో భాగస్వామ్యం కావాలని మహీంద్రా కంపెనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే మహీంద్రా- ఫినిన్‌ఫరినాల ఆధ్వర్యంలో రాబోయే హైపర్‌కారుని ఫీచర్స్ చాలా స్పెషల్‌గా ఉండబోతున్నాయి.

ఈ కారు ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం.ఈ కారు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లుగా ఉండబోతుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)

ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే ఐదొందల కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.ఈ కారు కోసం ఇప్పటికి కేవలం ఐదు బుకింగ్స్ కాగా, స్టార్టింగ్ మేకింగ్‌లో 150 కార్లు రెడీ చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు