'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఆ రోజు ఫ్యాన్స్ కు పండగే!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Kaaram ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

 Mahesh Guntur Kaaram Trailer Release Date Fix Details, Guntur Kaaram Trailer, Gu-TeluguStop.com

ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఇది పాన్ ఇండియన్ కాకపోయినా భారీ బిజినెస్ చేసుకుని రీజనల్ సినిమాల్లోనే రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతుంది.

దీంతో ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవ్వకుండా చూసుకోవాలని టీమ్ అంత చాలా కష్ట పడుతున్నారు.ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు డబల్ చేసేందుకు మరింతగా ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ కాగా మొదటి సాంగ్ చార్ట్ బస్టర్ కాగా రెండవ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఈ సాంగ్ విషయంలో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Guntur Kaaram Trailer) గురించి అదిరిపోయే అప్డేట్ వైరల్ అయ్యింది.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ లాక్ చేసినట్టు తెలుస్తుంది.మరి ఈ ట్రైలర్ ను కొత్త సంవత్సరం రోజు జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.దీంతో ఇది ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ (Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube