ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ ( Raviteja Harish shankar ) డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తమిళ నటుడు అయిన విక్రమ్ ( Vikram )ని తీసుకుబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది సెకండ్ హాఫ్ లో ఒక 20 నిమిషాల పాటు కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఈ సినిమా సోల్ మొత్తం ఆ క్యారెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా స్టోరీ ని ఇప్పటికే విక్రమ్( Vikram ) కు వినిపించినట్టుగా తెలుస్తుంది.అతను కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో హరీష్ శంకర్ మరోసారి తన సత్తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ మధ్యలో గ్యాప్ దొరికిన సమయంలో ఈ సినిమాను తీసి సక్సెస్ చేసి పవన్ కళ్యాణ్ కి సక్సెస్ తో స్వాగతం పలకబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు.
కానీ కచ్చితంగా ఈ సినిమా మాత్రం ఈ గ్యాప్ లో చేసి రిలీజ్ చేయడానికి హరీష్ శంకర్ రవితేజ ఇద్దరు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం రవితేజ డేట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి.ఎందుకంటే గోపీచంద్ మలినేని డైరెక్షన్( Gopichand Malineni ) లో వచ్చే సినిమా కోసం కేటాయించిన డేట్స్ ని ఈ సినిమా మీదికి షిఫ్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక హరీష్ శంకర్ కి ఇదే మంచి సమయం సినిమా చేసి తన టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద కూడా తన మార్కు చూపిస్తాడు అంటూ అభిమానులు కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉంటారు…ఇక ఈ సినిమా తో మరోసారి హరీష్ తన మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి రెఢీ అవుతున్నాడు…
.