సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని మొదట్లో ఫ్యాన్స్ నుండి కూడా చాలా అనుమానాలు వచ్చాయి.
కానీ మహేష్ స్పీడ్ చూసి ఖచ్చితంగా అనుకున్న సమయానికే వస్తుంది అని ఫిక్స్ అయ్యారు.
ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా నుండి కొన్నాళ్లుగా లీక్స్ వస్తూనే ఉన్నాయి.మహేష్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా మరోసారి ఈ సినిమా లీక్స్( Guntur Karam Leaks ) బారిన పడింది.
ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా దమ్ మసాలా సాంగ్ ను( Dum Masala Song ) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.అయితే ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది.
ఈ సాంగ్ షూట్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో మహేష్ బాబు మాస్ స్టెప్పులు వేస్తున్నాడు.డ్యాన్సర్లతో కలిసి మహేష్ ఓ రేంజ్ లో స్టెప్పులు వేయడంతో ఈ సాంగ్ థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయం అని అనిపిస్తుంది.మరి ఏదొక లీక్ ఈ సినిమా నుండి వస్తూనే ఉండడంతో మేకర్స్ ను కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.