సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కరోనా కారణంగా దాదాపు పది నెలలుగా ఆయన మరో సినిమాను మొదలు పెట్టలేదు.
అప్పుడప్పుడు యాడ్ షూట్ లో పాల్గొంటూ ఎక్కువగా కుటుంబంకు సమయాన్ని కేటాయించాడు.చాలా మంది హీరోలు ఈ ఏడాది వృదా అయినందుకు వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అందరు మాదిరిగానే మహేష్ బాబు కూడా వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేసే విషయమై తీవ్రంగా చర్చలు జరుపుతున్నాడట.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో విడుదల చేసి మరో సినిమాను డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నాడట.
ఈమద్య కాలంలో ఏడాదికి మహేష్‌బాబు నుండి రెండు సినిమాలను ఆశిస్తున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు.అభిమానుల కోరిక మేరకు సర్కారు వారి పాట మాత్రమే కాకుండా వచ్చ ఏడాది మరో సినిమాను కూడా చేయాలనుకుంటున్నాడు.
దానికి తోడు 2022లో రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంటుంది.కనుక స్పీడ్ గా సినిమాలు చేసే అవకాశం ఉండదు.కనుక మహేష్‌బాబు సాధ్యం అయినంత వరకు స్పీడ్‌గా సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.మహేష్‌బాబు నిర్ణయం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
అయితే సర్కారు వారి పాట కాకుండా మహేష్ చేయబోతున్న మరో సినిమా ఏమై ఉంటుందా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం అయ్యింది.సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.
మరో సినిమాను కూడా చిన్న బడ్జెట్ తో మహేష్ చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.ఆ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.