సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతోన్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది.ఈ సినిమా ఇంకా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.కానీ ఇంకా షూటింగ్ చేయడం పట్ల మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

గుంటూరు కారం సినిమా ( Gunturu kaaram movie )షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వడానికి ఇంకా కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని అంటున్నారు.అంటే డిసెంబర్ 30వ తారీకు వరకు షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టే అవకాశం లేదు.అంటే విడుదల కు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంటుంది.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎలా చేస్తారు.ఎలా సినిమా ను ప్రమోట్ చేస్తారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.సంక్రాంతికి పెద్ద ఎత్తున పోటీ ఉన్న సమయంలో ఇలా షూటింగ్ కే ఇంత సమయం కేటాయిస్తే పరిస్థితి ఏంటి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

మరో వైపు గుంటూరు కారం సినిమా లోని ఒక పాట విషయం లో మహేష్ బాబు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.ఆ పాటను మళ్లీ చేయాల్సిందే అంటూ మహేష్ బాబు పట్టుబడుతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇప్పటికే యూనిట్ సభ్యులు ఆ విషయాలను కొట్టి పారేశారు.అయినా కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అవ్వక పోవడం పట్ల మహేష్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్రివిక్రమ్ ఈ సినిమా ను కచ్చితంగా హిట్ మూవీ గా తీర్చి దిద్దుతాడు అనుకుంటే ఇలా చేస్తున్నాడు ఏంటి అనే అసహనం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో మహేష్ బాబు కు జోడీగా శ్రీలీల ( Mahesh babu Sreeleela) నటిస్తున్న విషయం తెల్సిందే.