సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఈయన ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్ళింది.
వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి దశాబ్దానికి పైగానే అవుతుంది.అందుకే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కానీ ఆ సమయానికి పూర్తి అవుతుందో లేదో చూడాలి.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో తమిళ్ హీరో భాగం అవ్వబోతున్నారు అని ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
కోలీవుడ్ యంగ్ హీరో విక్రమ్ ప్రభు ఈ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు టాక్.ఈయన తమిళ్ లో సోలో హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ సత్తా చాటుతున్నాడు.

ఈ క్రమంలోనే మహేష్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.విక్రమ్ ప్రభు మహేష్ సినిమాలో ఈ రోల్ నచ్చి ఓకే చెప్పారని తాజాగా సమాచారం అందుతుంది.ఇక ఈయన నటించేది నిజమే అయితే మహేష్ సినిమాకు తమిళ్ లో మంచి హైప్ రావడం ఖాయం.చూడాలి ఇందులో ఎంత నిజం ఉందొ.జనవరిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.







