టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సూపర్ హిట్ చిత్రం శ్రీమంతుడు( Sreemanthudu ) .2015 వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ సినిమాలో మహేష్ బాబు శృతిహాసన్( Shruthi Hassan )జంటగా నటించారు.ఇక ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమాతోనే గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది.ఇలా ఒక అద్భుతమైన మెసేజ్ ఉండడంతో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుంది.ఇలా ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 8 సంవత్సరాలు అవుతుండగా తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత రెండు సంవత్సరాలకు మైత్రి మూవీ మేకర్స్ వారు పూర్తి సినిమాని యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది.అయితే ఈ సినిమాని యూట్యూబ్ లో ఇప్పటివరకు 200 మిలియన్స్ ( 20కోట్ల ) వ్యూస్‍ను దాటింది.యూట్యూబ్‍లో 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా శ్రీమంతుడు రికార్డ్ సృష్టించింది.ఇలా తమ అభిమాన హీరో నటించిన ఈ సినిమా ఇంత మంచి రికార్డు సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మహేష్ బాబు మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను( bharath ane nenu ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో ఓ ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు ఎంతో ఒదిగిపోయినటించారు.ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేశారు.
దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన తన నిజజీవితంలో కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు విద్యార్థులకు ఎన్నో మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.ఇలా ఈ సినిమా పలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి పలువురు సెలబ్రిటీలలో చాలా ఇన్స్పిరేషన్ కలిగించిందని చెప్పాలి.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.







