తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh babu )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు మహేష్ బాబు.ఒక చివరగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు( krishna birth anniversary ) అన్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేశారు.

కాగా నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్, త్రివిక్రమ్( Trivikram ) సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.ఇక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఇవాళ చాలా స్పెషల్ రోజు.ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు మహేష్.
ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా మహేష్ బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.







