అసలు సాయిపల్లవికి ఎముకలు ఉన్నాయా.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ పాజిటివ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి.

తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన లవ్ స్టోరీ మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు తాజాగా లవ్ స్టోరీ సినిమాను చూశారు.

ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు లవ్ స్టోరీ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని మహేష్ బాబు అన్నారు.

లవ్ స్టోరీ మూవీ చైతన్య కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.సాయిపల్లవి గత సినిమాల్లో ఏ విధంగా అద్భుతంగా నటించారో ఈ సినిమాలో కూడా అదే విధంగా నటించారని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

Advertisement

సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాలో పాటలకు వేసిన డ్యాన్స్ స్టెప్పుల గురించి మహేష్ మాట్లాడుతూ సాయిపల్లవిలో ఎముకలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.సినిమాలలో సాయిపల్లవి వేసినటువంటి డ్యాన్స్ స్టెప్పులను గతంలో తాను అస్సలు చూడలేదని మహేష్ బాబు అన్నారు.మహేష్ పెట్టిన పోస్టు వల్ల లవ్ స్టోరీ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.

లవ్ స్టోరీ ఈ ఏడాది రిలీజైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.మహేష్ బాబు షేర్ చేసిన పోస్ట్ కు 11,700కు పైగా లైక్స్ వచ్చాయి.ఫిదా తర్వాత లవ్ స్టోరీ సినిమాతో శేఖర్ కమ్ముల ఖాతాలో మరో సక్సెస్ చేరింది.

Advertisement

తాజా వార్తలు