మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రీసెంట్‌గా అల వైకుంఠపురములో సినిమాను ప్రొడ్యూస్ చేసి కళ్లు చెదిరే లాభాలను కొల్లగొట్టాడు.కాగా ఈ సినిమాను రాధాకృష్ణతో కలిసి నిర్మించిన అల్లు అరవింద్, తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నారు.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఓ సినిమాను తీసేందుకు రెడీ అయ్యింది.ఈ క్రమంలో గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు పరశురాంతో ఈ సినిమాను తెరకెక్కించాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడు.
కానీ పరశురాం చెప్పిన కథ మహేష్‌కు నచ్చలేదట.దీంతో తనతో నెక్ట్స్ మూవీని చేసేందుకు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నాడని, ఆయనను ఈ సినిమాకు డైరెక్టర్‌గా పెట్టాలని మహేష్ కోరాడట.
కన్నడలో తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.అలాంటి ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టు ప్రశాంత్ దగ్గర రెడీగా ఉందని, అది మహేష్ గీతా ఆర్ట్స్ మూవీకి చాలా కలిసొస్తుందని మహేష్ చెప్పుకొచ్చాడు.
దీంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా పనిచేస్తాడా లేడా అనేది ఆసక్తిగా మారింది.ఈ సినిమాను వంశీ పైడిపల్లి సినిమా తరువాత ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మహేష్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.







