Mahesh Babu Ram Charan: ఒకరి చెప్పులు మరొకరు.. చరణ్ మహేష్ మధ్య ఉన్న అనుబంధానికి ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ లో చాలామంది హీరోల మధ్య మంచి స్నేహబంధం అన్న విషయం అందరికీ తెలిసిందే.అలా స్నేహబంధం అనగానే మనకు జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్, ప్రభాస్ – గోపీచంద్ లాంటి హీరోలు గుర్తుకు వస్తూ ఉంటారు.

 Mahesh Babu Ram Charan Close Relationship-TeluguStop.com

కేవలం మీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోల మధ్య మంచి అనుబంధం ఉంది.ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడంతో ఇలాంటి విషయాలు అభిమానులు బాగా తెలుసుకోగలుగుతున్నారు.

అలాంటి విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి.

కేవలం హీరోల మధ్య ఉన్న బాండింగ్ మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీ మధ్య ఉన్న బాండింగ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) రామ్ చరణ్( Ram Charan ) మధ్య క్లోజ్ బాండింగ్ మీద చర్చలు నడుస్తున్నాయి.తాజాగా మెగా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్( Diwali Celebrations ) జరిగిన విషయం తెలిసిందే.

క్లీంకారా వచ్చాక మొదటి పండుగ కావడంతో మెగా ఫ్యామిలీ( Mega Family ) ఈ దీపావళిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు.

టాలీవుడ్‌ లో చాలామంది సెలబ్రిటీలను ఈ వేడుకకు ఆహ్వానించారు.ఈ వేడుకలకు దాదాపు టాప్ స్టార్లంతా వచ్చారు.సీనియర్ హీరోల్లో బాలయ్య మాత్రమే మిస్ అయ్యాడు.

చిరు, నాగ్, వెంకీ ఇలా అందరూ ఒకే చోటకు వచ్చారు.మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ ఒక్క చోటే కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

ఇక తాజాగా ఆ ఫోటోలను ఫ్యాన్స్ డీ కోడ్ చేయడం మొదలుపెట్టారు.రామ్ చరణ్, మహేష్ బాబు ఫోటోలను కాస్త నిశితంగా గమనిస్తే.

వారిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది అర్థం అవుతోంది.

ఆ ఫోటోల్లో ఓ చోట మహేష్ బాబు వేసుకున్న చెప్పులు మరో చోట రామ్ చరణ్ వద్ద కనిపిస్తున్నాయి.అయితే ఎవరి చెప్పులు ఎవరు వేసుకున్నారనేది తెలియడం లేదు కానీ, ఇద్దరూ చెప్పులు మార్చుకునేంత క్లోజ్ ఫ్రెండ్సా? అని అందరూ ఆశ్చర్యపోతోన్నారు.ఈ విషయంపై మెగా అభిమానులు( Mega Fans ) ఘట్టమనేని అభిమానులు( Ghattamaneni Fans ) స్పందిస్తూ మహేష్ రామ్ చరణ్ మధ్య ఇంత మంచి స్నేహబంధం ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube