Mahesh Babu Mokshit Sai Heart Operation: తండ్రి మరణించిన రోజే మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు కేవలం సినిమాలలో మాత్రమే హీరోగా కాదు నిజ జీవితంలో కూడా ఈయన హీరో అని ఎన్నో సందర్భాలలో నిరూపితమైంది.

మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ కల్పించారనే విషయం మనకు తెలిసిందే.

అయితే సోమవారం తన తండ్రి హాస్పిటల్ లో చేరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఈయన మాత్రం ఎంత బాధలో కూడా మరొక ప్రాణాన్ని నిలబెట్టి తన మంచి మనసు చాటుకున్నారు.మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం మోక్షిత సాయి అనే చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణం నిలబెట్టారు.మోక్షిత సాయి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ అయి గుండె ఆపరేషన్ చేయించాలని మహేష్ బాబు సహాయం కోసం ఎదురుచూశారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తండ్రి విషయంలో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ చిన్నారి ఆపరేషన్ కి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా డబ్బు సమకూరడంతో మోక్షిత్ సాయికి గుండె ఆపరేషన్ చేసి ఆ చిన్నారికి పునర్జన్మ కల్పించారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహేష్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.సహాయం చేయడంలో మీ తర్వాతే ఎవరైనా అంటూ తన మంచి మనసుకి ఫిదా అవుతున్నారు.

ఒకవైపు తండ్రి లేరన్న బాధలో ఉన్నప్పటికీ మరోవైపు ఇంకో ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆలోచనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు