ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్ లో మంచి బజ్ నెలకొల్పిన చిత్రం ”మేమ్ ఫేమస్”( Ma’am Famous ).ఈ సినిమాను సుమంత్ ప్రభాస్( Sumanth, Prabhas ) తెరకెక్కించారు.
ఆయన డైరెక్షన్ లో అనేకమంది డెబ్యూ టాలెంటెడ్ యువతతో తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.ఇక తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పోస్ట్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి.
మహేష్ ఈ సినిమాపై ఆసక్తికర పోస్ట్ పెట్టడం ఆశ్చర్యకరంగా మారింది.ఈయన పోస్ట్ చేయడంతో ఈ సినిమా గురించి ఒక్కసారిగా అంతా మాట్లాడు కుంటున్నారు.
ఈ సినిమాపై మహేష్ తన రివ్యూ ఇచ్చేసాడు.

ఈ సినిమా తనకు అమితంగా నచ్చింది అని.చాలా మంది డెబ్యూ టీమ్ ( Debut team )తో ఈ సినిమాను తెరకెక్కించడం నమ్మశక్యంగా లేదని ఆయన తెలిపారు.అంతేకాదు నటుడు, రచయిత డైరెక్టర్ అయినటువంటి సుమంత్ ప్రభాస్ టాలెంట్ ను కూడా మహేష్ మెచ్చుకోవడం.
ఇలాంటి టాలెంట్ ను వెతికి మంచి సినిమాను తీసినందుకు గాను నిర్మాతలను కూడా మెచ్చుకున్నారు.అలాగే ఈ సినిమా టీమ్ మొత్తాన్ని కంగ్రాట్యులేట్ చేసి టోటల్ సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
విడుదలకు ముందే మహేష్ బాబు ఈ సినిమాను చూడడం ఆ తర్వాత వీరిని మెచ్చుకుంటూ పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమా రేపు అంటే మే 26న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

చాయ్ బిస్కట్ ఫేమ్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ( Anurag Reddy, Sarath Chandra, Chandra Manohar )లు ఈ సినిమాను నిర్మించగా అందరు కొత్తవారే ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు.మరి ఈ ప్రమోషన్స్ తో పాటు కంటెంట్ బాగుంటే మరో చిన్న సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.