సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా అభిమానులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఆయన ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ మూవీ అప్ డేట్ కోసం ఎదురు చూశారు.
ఇంకా షూటింగ్ ప్రారంభం కాని సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇస్తాం అనుకున్నారో ఏమో కాని.అసలు అప్డేట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది అయినా చెప్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ విషయంలో కూడా తీవ్రంగా నిరాశే కలిగించేలా విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబో సినిమా ఎప్పుడు ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరు కూడా జుట్టు పీక్కుంటున్నారు.సినిమాకు సంబంధించిన అప్‌డేట్ లేక పోవడంతో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.
నేడు బర్త్ డే సందర్బంగా అయినా చిన్న అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అయ్యే వారు కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కు సంబంధించిన గత ఏడాది బర్త్ డే అప్‌డేట్ తోనే ఈసారి కూడా సరి పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ మరియు పోకిరి ఇంకా ఒక్కడు సినిమా ల యొక్క స్క్రీనింగ్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు కనుక త్రివిక్రమ్ ను సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేయకుండా ఫ్యాన్స్ వదిలేశారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వచ్చే బర్త్ డే వరకు అయినా త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా మొదలు అయ్యేనా అనేది చూడాలి.
ఐనా వచ్చే ఏడాది బర్త్ డే కి రాజమౌళి నుండి సర్ ప్రైజ్ ఉండే అవకాశం ఉందని ఇప్పటి నుండే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.







