మహేంద్రసింగ్ ధోని మోకాలికి ముంబైలో శస్త్ర చికిత్స..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) కొంతకాలంగా ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

కాలిలో నొప్పి ఉన్న కూడా ఐపీఎల్ బరిలో దిగి చెన్నై జట్టును ఐదవ సారి విజేతగా నిలబెట్టాడు.

తాజాగా ధోని మోకాలికి ముంబైలోని కోకిలా బెన్( Kokila Ben in Mumbai ) హాస్పిటల్ లో శస్త్ర చికిత్స విజయవంతం అయింది.ఈ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత మహేంద్రసింగ్ ధోని మాట్లాడుతూ.

ఫ్యాన్స్ కు తనపై ఉండే అభిమానం కోసం మరో ఏడాది తన కెరియర్ కొనసాగించాలి అని అనుకుంటున్నట్లు ప్రకటించాడు.దీంతో ఫాన్స్ లో ఫుల్ జోష్ నెలకొంది.

కానీ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో మరో ఏడాది ఐపీఎల్ లో ఆడతాడా లేదా అనే విషయంలో కొంత ఆందోళన నెలకొంది.

Advertisement

ధోని శస్త్ర చికిత్స పై చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ( CEO Kashi Viswanathan )స్పందిస్తూ.ధోనీకి శస్త్ర చికిత్స డాక్టర్ దిన్ షా శస్త్ర చికిత్సలు చేయడంలో ఎంతో ఎక్స్ పర్ట్ అని తెలిపారు.భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Panth )కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

రిషబ్ పంత్ కు కూడా డాక్టర్ దిన్ షా శస్త్ర చికిత్స చేశారని తెలిపారు.

ముంబై కి చెందిన ఈ డాక్టర్ దిన్ షా ( Din Shah ) ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్.ఈ డాక్టర్ క్రీడాకారుల గాయాలు, ఎముకల శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఎంతో పేరు ఉందని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.కాబట్టి ఫ్యాన్స్ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తూ మరో రెండు రోజుల్లో ధోని ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అవుతాడని తెలిపారు.

కొన్ని రోజులు ధోని రాంచీలో విశ్రాంతి తీసుకుని, అనంతరం రిహేబిలేషన్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.అయితే 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని శస్త్ర చికిత్స చేపించుకోవడం ఇదే తొలిసారి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఇక మహేంద్రసింగ్ ధోని పూర్తి ఫిట్ నెస్ తో ఐపీఎల్ 17 వ సీజన్ కు సిద్ధం కాగలడని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు