ప్రతి ఒక్కరిలో స్పూర్తిని రగిలించే మహాత్మ గాంధీ చెప్పిన అద్భుతమైన నీతి సూక్తులివే!

ఈరోజు జాతిపిత మహాత్మ గాంధీ పుట్టినరోజు( Gandhi Jayanthi ) అనే సంగతి తెలిసిందే.మహాత్ముని సూక్తులు ఎంతోమందిని ప్రభావితం చేశాయి.గాంధీజీ( Mahatma Gandhi ) చెప్పిన సూక్తులలో కొన్ని సూక్తులను ఆయన పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకుందాం.

 Mahatma Gandhi Inspirational Quotes Details, Mahatma Gandhi, Mahatma Gandhi Quot-TeluguStop.com

1) అహం వలన ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే భయంకరమైనది.

2) ఆత్మవంచన పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకొన్నట్టే.

3) తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం( Success ) ద్వారా లభించదు.పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం.

4) మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం, ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం.

5) మరణానికి భయపడటం అంటే చిరిపోయిన బట్టను వదిలేందుకు భయపడటం.

6) దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల మేడలు కాదు పౌరుల నైతాకాభివృద్ధే నిజమైన దేశాభివృధి.

Telugu Freedom, Gandhi, Gandhi Jayanthi, Independance, Mahatma Gandhi, Mahatmaga

7) నీ అంగీకారం లేకుండా నీ ఆత్మ గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు.

8) నేటి నీ చేతలు రేపటి నీ భవిష్యత్తును ( Future ) నిర్ణయిస్తాయి.

9) చదువులో( Education ) ఆనందాన్ని పొందితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు.

10) రేపు మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు.

11) మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు.ముందు మీ నుంచే మొదలవ్వాలి.

12) ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నంతంగా ఉండాలి.ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటల్లో ప్రతిబింబిస్తాయి.

13) మీలో బలహీనత భయాన్ని( Fear ) పెంచుతుంది.ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది.

Telugu Freedom, Gandhi, Gandhi Jayanthi, Independance, Mahatma Gandhi, Mahatmaga

14) ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి.ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.

15) బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు.క్షమ అనేది బలవంతుల లక్షణం

16) నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు.ప్రపంచంతో స్నేహం చేయడం నా గమ్యం.

17) శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.

18) ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజల చేతిలోని ఆయుధాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube