టీడీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేసిన మహాసేన రాజేష్..!!

మహాసేన రాజేష్( Mahasena Rajesh ) అందరికీ సుపరిచితుడే.సోషల్ మీడియా వేదికగా దళితుల సమస్యలు ఇంకా అనేక విషయాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.2019 ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం చేయడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీ( YCP )తో విభేదాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.

 Mahasena Rajesh Has Made It Clear That He Is Still In Tdp Chandrababu, Mahasena-TeluguStop.com

ఈ క్రమంలో 2024 ఎన్నికల విషయంలో పి గన్నవరం నుండి ఎమ్మెల్యే టికెట్ అందుకున్నారు.కానీ కొన్ని అవాంతరాల వల్ల ఎమ్మెల్యే సీటు వదులుకోవడం జరిగింది.అనంతరం మహాసేన రాజేష్ సొంత పార్టీ పెట్టడానికి కూడా రెడీ కావడం జరిగింది.

మా ఆత్మగౌరవం కోసం వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు… పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియా( Social media )లో మూడు రోజుల క్రితం ప్రకటించడం జరిగింది.కానీ ఇటీవల చంద్రబాబుతో మహాసేన రాజేష్ మంతనాలు జరిపారు.ఈ క్రమంలో పార్టీ వీడి వెళ్ళటానికి వీళ్లేదని మా వర్గాల రక్షణ బాధ్యత అధినాయకుడు చూసుకుంటారని ఆందోళన చెందా అవసరం లేదని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు.

కాగా నేడు “అందరి సూచనలు, సలహాలు మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం.నామీద నమ్మకముంచిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు.మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరొక 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు.అందుకు మహాసేన కూడా సిద్ధం”.

అంటూ మహాసేన రాజేష్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube