రాజన్న సిరిసిల్ల జిల్లా: నేతన్నలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మాత్యులు పోన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బిఆరెస్ ,బీజేపీ లకు రాజకీయ ఆటలాడుతున్నాయి.
గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి.మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది.
నేతన్నల పేరు మీద ఈ రెండు పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నారు.వారు చేస్తున్న రాజకీయాన్ని నేతన్నలకు , మీ అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం.
స్వతంత్రం అనంతరం నేతన్నల ప్రయోజనం కోసం ఏమైనా చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే.బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12 శాతం జీఎస్టీ వేశారు.
వారిని వేధించారు.జాతీయ చేనేత బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది.
జాతీయ టెక్స్ టైల్ బోర్డును రద్దు చేసింది.మహాత్మ గాంధీ గుణకర్ భీమా యోజన ని రద్దు చేసింది.ఐసిఐసిఐ నాబార్డు ఆరోగ్య భీమా నీ రద్దు చేసింది.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎస్ ఐ డి పి పథకం పరిశ్రమిక అభివృద్ధి ప్రమోషన్ల కింద వేల కోట్ల నిధులు తెచ్చారు.
-కాని మన అసమర్థ పార్లమెంట్ సభ్యుడు 10 నాడు దీక్ష చేస్తున్నావ్ కదా తమిళనాడు కి ఎంత వచ్చాయి.ఈ రాష్ట్రానికి ఎంత తెచ్చారని ఎంపిని అడుగుతున్న.
దేశంలో ఎస్ ఐ డి పి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయని విడుదల చేస్తాం.టెక్స్ టైల్ ఇండస్త్రి ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల నంబర్ 1తెలంగాణ ప్రజల ఆకాంక్షల తరువాత ఏర్పడిన ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసింది.
వరంగల్ పవర్ లూమ్ కస్టర్ లు ఏర్పాటు చేస్తామన్నారు… అది సిరిసిల్ల కి చీకటి దినం అన్నాము.సిరిసిల్ల కి పవర్ లూమ్ కస్టర్ అడిగాం.అప్పుడు కనీసం నోరెత్తని పార్లమెంట్ సభ్యుడు ఏం ముఖం పెట్టుకొని 10 నాడు దీక్ష చేస్తున్నావుఈ 5 ఏళ్లలో ఎం చేశావని అడుగుతున్న.కేంద్రం నుండి ఒక్క రూపాయి అయిన సహాయ చేశావా.
ఎస్ ఐ డి పి కింద 300 కోట్లు ఉంటే 25 శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్దంగా ఉంది.మిగిలింది కేంద్ర ప్రభుత్వం నుండి తేవాలి.ఈ పాపం ఎవరిది.550 కోట్ల బకాయి లు చేసింది ఎవరు.మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన ఎవరిపైన అయిన కక్ష సాధింపు చర్యలు చెప్పటామబతుకమ్మ చీరలకి సంబంధించినవే 300 కోట్లు.ఆ బకాయిలు ఎందుకు చెల్లించలేదు.
పెళ్లి అయిన వారికి అరుంధతి నక్షత్రం చుపెట్టినట్టు చుపెట్టావ్.డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసిన సంతోషం ఏడాది ఉంటే తరువాత బాధలు యేడాది ఉన్నాయి.
అన్ని సహకార సంఘాలకు పని చేసే ప్రతి ఒక్కరికీ పని ఇవ్వాలని ఉద్దేశ్యం మాకు ఉంది .రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మాకు పని లేదన్న మాట వినబడకుండ పని కల్పిస్తున్నాం.జీఓ నంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని చేనేత ల నుండి వస్త్రాల కొనుగోలు చేయడానికి జీఓ తీసుకొచ్చాం.ఈ నాలుగు నెలల కాలంలో 120 కోట్ల ఆర్డర్ సిరిసిల్ల కి ఇచ్చాం.
గతంలో పరిశ్రమ లేదా .మీరు మీ కంట్రోల్ లో ఉండే ప్రయత్నం చేశారు.మళ్ళీ అన్ని బాగు చేస్తున్నాం.తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరుల పేరు చెప్పి శవాల పేరు మీద పెలలు ఎరుకున్నట్టు వ్యవహరించారు.చావు మార్గం కాదు.ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టేద్దు.
మేమంతా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఒక్క కష్టం కూడా రాకుండా చుస్కుంటాం.కేటిఆర్ ఒక ఆర్థిక సంవత్సరంలోకి మేము ఇచ్చామన్న ఆర్డర్స్ కి ఎక్కువే ఇస్తాం కానీ తక్కువ ఇవ్వం .సిరిసిల్ల నేతన్నల సం బకాయిలు అన్ని పేమెంట్ చేసే బాధ్యత మాది.ప్రతి రూపాయి పేమెంట్ చేస్తాం.
ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి బట్టి తో చర్చించాము.ఒక దశలో ఇప్పుడు తరువాత దశలో మరింత పేమెంట్ చేస్తాం.
వినోద్ ఇక్కడ చిప్ప చేతికిచ్చి అక్కడికి ఇండస్ట్రీ తీసుకుపోయాడు.
నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎం చేశానో చెప్పడానికి సిద్దంగా ఉన్నాం.
మీరు ఎం చేశామో చెప్పకుండా అక్షింతలు పేరుతో ఓట్లు అడుగుతున్నారు.నరేంద్ర మోడీ పేరు చెప్పి కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదు .10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఈ పాపానికి బాధ్యులు కాదు .దీక్ష చేసే వారు ముందు దీనికి జవాబు చెప్పాలి.చేనేత మీద జీఎస్టీ వేసింది మీరు కాదా.నేతన్నలు వీరి ట్రాప్ లో పడకండి.మేము నష్టం చేస్తే మమల్ని నిలదీయండి.10 సంవత్సరాల్లో మేము చేనేత వారిని కలుద్దమంటే ఆ ప్రకటిత కర్ఫ్యూ లా కలవని పరిస్థితి ఉండేది.ఆర్డర్స్ ఇస్తాం.పెట్టుబడి కి డబ్బులు కూడా మేమే ఇస్తున్నాం.పవర్ సబ్సిడీ ఇష్యూ,యార్డు ఇష్యూ అన్నిటినీ చేయడానికి సిద్దంగా ఉన్నాం.పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు చేశాం…సాంకేతికంగా వృత్తిని అభివృద్ధి చేస్తాం.
నేతన్న గీతన్న వేరు కాదు.గతంలో టెక్స్ టైల్ పరిశ్రమ వరంగల్ వెళ్తే నిరసనలు తెలిపాం.
సిరిసిల్ల నేతన్నలు ఈ ఇబ్బంది ఉన్న.అధికారులు కూడా చెబుతున్న పవర్ బకాయిలు ఉన్న ఇబ్బంది పెట్టద్దు .మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చాం.-ఈ ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఎగరగొట్టింది.
రాష్ట్రం మొత్తం 12 వేల అంత్యోదయ కార్డు ఉంటే ఒక సిరిసిల్ల లోనే 12 వేల కార్డ్స్ ఉన్నాయి.అవి తీసేసింది మీరు కాదా.
శవాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిస్తున్నా.నేతన్నలు అదైర్యపడకండి .మా ప్రభుత్వం లో ఎవరైనా ఉన్న నిలదీస్తాం.రాష్ట్రంలో ఎవరైనా కలిసే విధంగా స్వేచ్చగా పాలన అందిస్తున్నాం.
రాబోయే కాలంలో సాంకేతికంగా మరింత అభివృద్ధికి తీసుకెళ్తాము.చేనేత కార్మికులకు చేతి నిండా పని కలిస్పిస్తాం.
పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తాం .ఇప్పటికీ 180 కోట్లు విడుదల చేశాం.
గత ప్రభుత్వం నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్ర బకాయిలను టెస్కో కు చెల్లించవలసి ఉన్నది.2023 బతుకమ్మ చీరల పథకం( Bathukamma Sarees ) కింద టేస్కో కు చెల్లించవలసిన 351.52 కోట్లు కదా ప్రభుత్వం చెల్లించలేదు.నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర శిక్ష పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం 50% అడ్వాన్సు, సుమారుగా 47 కోట్ల రూపాయలు నూలు కొనుగోలు మరియు సైజింగ్ వరకు విడుదల చేయడమైనది అన్నారు.దీని ద్వారా నాణ్యమైన నూలు కొనుగోలు చేసి వస్తా ఉత్పత్తులకు సుమారుగా 14 కోట్ల విలువైన నూలు సరఫరా చేయడమైనది.ఎన్ హెచ్ డి సి ద్వారా కొనుగోలు చేసిన నూలు ఖరీదుకు సంబంధించిన 1.47 కోట్లు సంబంధిత ఎంఏసిఎస్/ ఎస్ఎస్ఐ యూనిట్స్? సైజింగ్ యూనిట్స్ కు అడ్వాన్స్గా నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు.గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను విస్మరించి ఎంఎసిఎస్ సహకార సంఘాలను ప్రోత్సహించడం వలన నిజమైన చేనేత కార్మికులకు లబ్ధి చేకూర లేదు…గత ప్రభుత్వం 393 చేనేత సహకార సంఘాలు ఉన్నప్పటికీ కేవలం 105 చేనేత సహకార సంఘాలకు మాత్రమే పని కల్పించింది.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మొత్తం చేనేత సహకార సంఘాల సభ్యులకు పని కల్పించుటకు నేటి వరకు సుమారుగా 53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసి అన్ని సహకార సంఘంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సక్రమ అందరికి పని కల్పించుటకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు.
గత బకాయిలు 8.81 కోట్ల చేనేత సహకార సంఘాలకు విడుదల చేసి చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించుటకు చర్యలు తీసుకోవడం జరిగింది.నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల వారు టెస్కో ద్వారా వస్త్రములు కొనుగోలు చేయుటకు జీవో నెంబర్ 1 (11.03.2024) ఆదేశాలు ఇచ్చారని అన్నారు.ఈ ఆదేశాల ప్రకారం తెచ్చుకో నుండి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ మార్కెట్ ద్వారా వస్త్రాలను కొనుగోలు చేయలేరు దీని ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల నుండి సుమారుగా 255.27 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం వచ్చయన్నారు.రాష్ట్ర మొత్తంలో( 140) మాక్స్ సొసైటీలు, (135) ఎస్ఎస్ఐ యూనిట్స్ ఉన్నవని, వీడియోకా విద్యుత్ వినియోగం పరిశీలించిన తర్వాత సుమారుగా 30% బోగా సొసైటీలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడమైందన్నారు.
గత ప్రభుత్వం చేనేత మిత్ర కార్మికుల పథకమును హడావిడిగా ప్రవేశపెట్టి ఇట్టి పథకానికి క్యాబినెట్ ఆమోదం లభించలేదని దానికి కారణంగా నిధులు విడుదల చేయడం జరగలేదన్నారు.ఈ పథకం ప్రచార నిమిత్తమై విడుదల చేసి చేనేత కార్మికులను మోసం చేయడం జరిగిందన్నారు.
నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత మరియు మరమగాల కార్మికుల సంక్షేమం కోసం రివ్యూ చేసి తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలిక లబ్ధి చేకూరే నిమిత్తం పథకాల రూపకల్పన కొరకు ఆదేశించారని అన్నారు.దీనిలో భాగంగా నేత కార్మికుల స్వయం సమృద్ధి కొరకు నేతన్న భరోసాని ప్రభుత్వ విధానం రూపొందించడం కొరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ న్యూ పవర్లుమ్ కస్టర్ల అభివృద్ధి, కొత్త మైక్రో హ్యాండ్లూమ్ కష్టాల్లో ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్ ఏర్పాటు స్టేట్ టెక్నికల్ టెక్స్టైల్ పాలసీ రూపొందించుటకు తగు చర్యలు.