200 క్వింటాళ్ల ఉల్లిని ఉచితంగా పంచిన రైతు కార‌ణం ఇదే..

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి.దీంతో రైతుల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది.ఉల్లిని విక్రయించలేక ఇబ్బంది పడిన ఓ రైతు 100 కిలోలు కాదు.500 కిలోలు కాదు.ఏకంగా 200 క్వింటాళ్ల (20 వేల కిలోలు) ఉల్లిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు.బుల్దానా జిల్లా షెగావ్‌లో నివసిస్తున్న కైలాష్ పింపుల్ అనే రైతుకు 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు.

 Maharashtra Farmer Distributed 200 Quintals Of Onions Maharashtra, Farmer , 200-TeluguStop.com

ఈసారి పంట కూడా బాగానే వచ్చిందని కైలాష్ తెలిపారు.

2 లక్షలు ఖర్చయినా ఒక్కసారిగా తగ్గిన ఉల్లి ధరలు అత‌నిని కుంగ‌దీశాయి.

ఈ ఉల్లిని మార్కెట్‌లో కిలో 4 నుంచి 5 రూపాయలకు విక్రయిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు కూడా వారి పంటకు సరైన ధర ఇవ్వడం లేదు.

తాము పండించిన ఉల్లి పంటను మండీకి తీసుకెళ్లే వ్యవస్థ కూడా లేదని రైతులు చెబుతున్నారు.షెగావ్ నగరంలోని మాలిపురా కాంప్లెక్స్‌లో నివసించే కైలాష్ పింపుల్ ఇంటి ముందు 150 నుండి 200 క్వింటాళ్ల ఉల్లి పంటను ఉంచాడు.

సూర్యరశ్మి కారణంగా ఉల్లి పంట పాడైపోయింది.అతనికి నిల్వ చేసే సౌకర్యం లేదు.

రైతు తన ఉల్లి పంటను ఉచితంగా పంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.దీనిని మొదట ఎవ‌రూ నమ్మలేదు.

కానీ రైతు నుండి పదేపదే అభ్యర్థనలు రావడంతో, ఉల్లిపాయల‌ను ఉచితంగా తీసుకోవడానికి ప్రజలు గుమిగూడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube