కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవీందర్ చంద్రశేఖరన్ ( Ravinder Chandrasekaran ) ఒక వ్యక్తిని మోసం చేసినటువంటి కేసులో భాగంగా అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే.ఒక ప్రాజెక్టు నిమిత్తం వేరే వ్యక్తి వద్ద కోళ్లల్లో డబ్బు తీసుకొని మోసం చేశారు అంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలా రవీందర్ అరెస్ట్ కావడంతో తన భార్య మహాలక్ష్మి ( Mahalakshmi ) మాత్రం ఎప్పటిలాగే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.తన భర్త అరెస్టయి జైల్లో ఉండగా ఈమె మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం ఈమె సోషల్ మీడియాలో ఎంతో అందమైనటువంటి ఒక ఫోటోని షేర్ చేయడంతో పలువురు ఈ ఫోటో పై విమర్శలు చేశారు.ఒకవైపు భర్త జైల్లో ఉండగా సోషల్ మీడియా( Social Media )లో ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏంటి నువ్వు ఆయన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా లేకపోతే డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావా అంటూ విమర్శలు చేశారు.అయితే రవీందర్ అరెస్టు( Ravindar Arrest ) గురించి మహాలక్ష్మి సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారని కోలీవుడ్ మీడియాలో వీరి వ్యవహారం సంచలనంగా మారింది.
ఇదివరకే పెళ్లి చేసుకొని ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను.తిరిగి రవీందర్ ను తాను పెళ్లి చేసుకున్నానని అయితే మరోసారి కూడా మోసపోయాను అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారని ఈమె సన్నిహితులు తెలియజేస్తున్నారు.పెళ్లికి ముందు ఇలాంటి విషయాల గురించి రవీందర్ నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని ఈమె సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట.
ఇక భర్త జైల్లో ఉండడంతో మహాలక్ష్మి కాస్త ఒత్తిడికి( Pressure ) కూడా గురవుతున్నట్లు ఆమె సన్నిహితులు వెల్లడించారు.మహాలక్ష్మి రవీందర్ తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఇక వీరిద్దరికీ ఇది రెండవ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.కొద్ది రోజుల క్రితం ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవ వేడుక( First Marriage Anniversary )ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.