దేశంలోనే మహారాష్ట్ర కీలకమైన రాష్ట్రం. యూపీ తర్వాత రాజకీయ నేతలందరి కళ్లు మహారాష్ట్రపైనే నెలకొని ఉంటాయి.
అందుకే జాతీయ పార్టీలు మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి.అయితే మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీలు కూడా ధీటుగా జాతీయ పార్టీలను ఎదుర్కొని అధికారంలోకి వస్తున్నాయి.
గత ఎన్నికల్లో శివసేన పార్టీ కూటమి సహాయంతో మహారాష్ట్రలో అధికారం చేపట్టింది.కానీ ఇప్పుడు పరిస్థితి శివసేన చేయి దాటిపోయినట్లు కనిపిస్తోంది.
సాధారణంగా ఒక పార్టీని నడుపుతున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.పార్టీ శ్రేణులపై పూర్తిగా పట్టు కలిగి ఉంటూనే ఇతర పార్టీల కుయుక్తులను పసిగడుతుండాలి.కానీ బీజేపీ విషయంలో శివసేన ఈ పని చేయలేకపోయింది.శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పార్టీపై నియంత్రణ కోల్పోవడంతో ఇప్పుడు అధికారాన్నే వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
మెజార్టీ సీట్లు గెలుచుకుని అధికార పీఠం ఎక్కి కొద్ది రోజులకే దిగపోవడం అంటే మాములు విషయం కాదు.మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి.దీంతో తొలుత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే మూడురోజులకే ఆయన సీఎం పీఠం నుంచి దిగిపోయారు.దీనికి కారణం కాంగ్రెస్, ఎన్సీపీ సహాయంతో శివసేన అధికారం చేపట్టడమే.
ఎన్సీపీ నేతలు తొలుత బీజేపీకి మద్దతు ఇచ్చి ఉపసంహరించుకున్నారు.

ఇటీవల మహారాష్ట్ర శాసన మండలిలోని 10 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి నలుగురు సభ్యులనే గెలిపించుకునేంత బలమే ఉంది.కానీ ఆ పార్టీ ఐదో అభ్యర్థిని బరిలో దింపింది.
శివసేన, ఎన్సీపీ రెండేసి స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచాయి.అంటే కూటమి పార్టీలు ఒక స్థానం కోల్పోయాయి.
వాస్తవానికి బీజేపీ ఐదో అభ్యర్థిని బరిలో నిలిపినప్పుడే శివసేన కూటమిలో అనుమానం రావాల్సింది.తమ పార్టీల్లో శాసన సభ్యులను చీల్చేందుకు ఏమైనా కుట్ర జరుగుతుందా అనేది ఆలోచించాల్సింది.
అయితే ఉద్ధవ్ థాక్రే ఇదేమీ చేయలేకపోయారు.దీంతో శివసేన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.