మధురై రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

తమిళనాడులోని మధురైలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలను గుర్తించారని తెలుస్తోంది.

 Madurai Train Accident Death Toll Rising-TeluguStop.com

అగ్నిప్రమాదంతో గాయపడిన ఇరవై మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మధురై జిల్లా కలెక్టర్ తెలిపారు.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు నిర్ధారించారు.

లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న స్పెషల్ ట్రైన్ లో అగ్నిప్రమాదం జరిగింది.బోగీలో టీ తయారు చేస్తుండగా సిలిండర్ పేలింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరగగా బాధితులు అంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా అధికారులు గుర్తించారు.మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.అదేవిధంగా ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube