వైరల్: చెప్పులెత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ..!?

నిత్యం తీరిక లేకుండా బిజీబిజీగా ఉండే పోలీసులకు. అప్పుడప్పుడు విచిత్రమైన కేసులు వస్తుంటాయి.దొంగతనాలు జరిగాయనో.హత్య జరిగిందనో, దాడి చేశారనో, వేధిస్తున్నారనో ఇలా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు.కానీ ఒక వ్యక్తి రూ.180 విలువైన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఈ వింత కేసు నమోదైంది.మొదట ఇది విన్న పోలీసులు నవ్వుకున్నారు.చెప్పుల గురించి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అంటూ పోలీసులు ఆ రైతుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయితే చివరకు ఆ రైతు చెప్పిన లాజిక్ విన్న పోలీసులు చివరకు కంప్లైంట్ తీసుకోలేక తప్పలేదు.

 Madhya Pradesh Farmer Lodges Complaint For His Stolen Slippers Details, Viral L-TeluguStop.com

వివరాల్లోకి వెళ్తే.ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.తన చెప్పులను ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగి ఉందని, దొంగ తన చెప్పులను వేరే నేరం చేసిన ప్రదేశంలో వదిలేస్తే.

తానే దోషినవుతానని జితేంద్ర పోలీసులకు చెప్పాడు.ఎవరో తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు.

అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు జితేంద్ర.

Telugu Rs Slippers, Madhya Pradesh, Slippers, Stolen Slippers, Ujjain, Latest-La

అయితే రైతు చెప్పిన “లాజిక్” పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు తీసుకుని.ఫిర్యాదు స్వీకరించారు.దొంగ తన చెప్పులను ఏదైనా నేరానికి ఉపయోగిస్తే తాను బాధ్యత వహించనని దరఖాస్తులో పేర్కొన్నాడు.

చెప్పులు చోరీకి గురవడంపై విచారణ జరుపుతారని పోలీసులు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube