హయగ్రీవ ఫార్మ్స్& డెవలపర్స్ సంస్థకు కేటాయించిన స్థలం లో నిర్మాణం పనులు తక్షణం ఆపాలి:జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్

హయగ్రీవ ఫార్మ్స్& డెవలపర్స్ సంస్థకు అనదాశ్రమం, వృద్దాశ్రమం ఏర్పాటు నిబంధనతో 2008 డిసెంబర్ 6వ తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1447 ప్రకారం కేటాయించిన ఎండాడ సర్వే నంబర్ 92/3 లోని 12.50 ఎకరాల స్థలంలో సకాలంలో అనదాశ్రమం, వృద్దాశ్రమం నిర్మించి వినియోగంలోకి తేవడంలో హయగ్రీవ విఫలమైందున, కొత్త వ్యక్తులు అభివృద్ధి పనులు చేపడుతున్నందున ఆ భూమి ని స్వాధీనం చేసుకోవాలి.నిర్మాణ పనులు నిలిపివేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వినతి ఈరోజు స్పందనలో జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ కమిషనర్ లకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వినతిపత్రాన్ని సమర్పించారు.

 Janasena Corporator Murthy Yadav Urges Immediate Halt To Construction Work On L-TeluguStop.com

ఎండాడ గ్రామం సర్వే నంబర్ 92/3 లో 12.50 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని 2008 లో అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 1447 ప్రకారం 10% స్థలంలో అనదాశ్రమం, వృద్దాశ్రమం ఏర్పాటు, మిగతా 90 శాతంలో వయోవృద్ధులకు మాత్రమే హోమ్స్ నిర్మాణం చేసి విక్రయించే నిబంధనలతో హయగ్రీవ ఫార్మ్స్& డెవలపర్స్ సంస్థకు కేటాయించారు.సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో హయగ్రీవ సంస్థ విఫలం కావడంతో రెవిన్యూ అధికారులు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకున్నారు.దీనిపై హయగ్రీవ వారు కోర్టులో సవాల్ చేయగా మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన ప్రతిపాదిత ప్రాజెక్టు అనగా 10శాతం లో అనాధ, వృద్దాశ్రమాన్ని మూడేళ్ల నిర్మాణం చేసి 90శాతంలో వయోవృద్ధులకు హోమ్స్ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చియున్నదని , ప్రాజెక్టు ప్రయోజనాలను విస్మరించి హయగ్రీవ సంస్థ వారు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సొంత ప్రయోజనాల కొరకు ఎంవివి సత్యనారాయణ, గన్నమనేని వెంకటేశ్వరరావులతో 50-50 పద్దతిన విల్లాల నిర్మాణం చేయటకు 2020 ఫిబ్రవరి 18వ తేదీన ఒప్పందం కుదుర్చుకొనియున్నారని.26 మంది ప్రయివేట్ వ్యక్తులకు 32000 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసియున్నారని.స్థల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్లను రిజిస్ట్రేషన్ శాఖవారు గుర్తించి రద్దు చేసియున్నారు.భూమి క్రమబద్ధీకరణ, రహదారులు, డ్రైనేజీలు వంటి మౌళిక సదుపాయాలు కల్పించకుండానే వెయ్యి, రెండువేలు గజాలను ప్లాట్స్ రూపంలో విక్రయించినారు.

ప్రభుత్వం వద్ద భూమి పొందినప్పటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండా అక్రమ వ్యాపార లావాదేవీలు జరిపినటివంటి హయగ్రీవ ఫార్మ్స్& డెవలపర్స్ సంస్థ ప్రభుత్వం కేటాయించిన భూమిలో సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయడంలో విఫలం అయివున్నది.అనాధ, వృద్ధ ఆశ్రమాలు, వయోవృద్ధుల హోమ్స్ ప్రాజెక్టును పక్కదోవ పట్టించడం, రూ.500 కోట్ల విలువైన భూముల్లో అక్రమ ఆర్థిక భూ లావాదేవీలు జరపడం తదుపరి అంశాలు పరిగణనలోకి తీసుకుని హయగ్రీవ సంస్థ కు కేటాయించిన ఎండాడ సర్వే నెంబర్ 92/ 3 లోని 12.50 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి.గత ఏడాది డిసెంబర్ 27 వ తేదీన ఈ విషయం పై తమరికి లిఖితపూర్వకంగా స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఫిర్యాదు పై చర్యలు తీసుకోక పోగా నిర్మాణ పనులకు అవకాశం కల్పించడం చట్ట విరుద్ధం.

పనులను ఆపి స్ధలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోరారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube