ఎలాంటి సాధనం లేకుండానే కరెక్టుగా టైమ్​ చెప్పేస్తున్న యాచకుడు!

ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరైనా సరే… గడియారం, మొబైల్ ఫోన్ చూడకుండా టైం ఎంతైందో చెప్పగలరా? ప్రస్నార్ధకమే కదా! అయితే పూర్వ కాలంలో ఇలాంటివేమీ ఉండేవి కాదు.అప్పట్లో ప్రతి ఒక్కరికీ సమయం మీద మంచి పట్టు ఉండేది.

 Madhya Pradesh Beggar Sukhlal Telling Time Without Looking At Watch Details, Vir-TeluguStop.com

ఎలాంటి పరికర మాధ్యమాలు లేకుండానే సమయాన్ని లెక్కించేవారు.ఇపుడు అది కష్టమనుకోండి.

ఎందుకంటే ఇపుడు మనిషి పరాన్న జీవిలాగ బతుకుతున్నాడు.ప్రతిదానికి ఏదోఒక మాధ్యమం మీద ఆధారపడాల్సిన పరిస్థితి.

అయితే ఇలాంటి యుగంలో కూడా అక్కడక్కడా సాధుపుంగవుల్లాంటి మనుషులు తారసపడుతూ వుంటారు.

ఇపుడు అలాంటి వ్యక్తి కోసమే ఇపుడు మాట్లాడుకోబోతున్నాం.

సాంకేతిక యుగంలోనూ ప్రాచీన పద్ధతిని గుర్తుకు తెచ్చే అరుదైన వ్యక్తి ఉన్నాడు.ఆ యువకుడు ఎలాంటి వాచీ, మొబైల్‌ను చూడకుండానే సమయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టి చెబుతున్నాడు.

మధ్యప్రదేశ్​ బుర్హాన్‌పూర్ జిల్లా నేపానగర్​కు చెందిన సుఖ్‌లాల్‌కు ఉన్న ఈ ప్రత్యేకమైన కళను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.అందుకే ఆయనను ‘నడిచే గడియారం’ అని అక్కడి ప్రజలు పిలుస్తున్నారు.

సుఖ్​లాల్​ చెప్పే సమయం, గడియారంలోని టైమ్​ సరిగ్గా​ పోలి ఉంటుందని స్థానికులు చెప్పడం గమనార్హం.

ఇక ఈ కళ భగవంతుడి అనుగ్రహంతోనే పొందానని సుఖ్ లాల్ స్థానిక మీడియాతో చెప్పడం విశేషం​​.ప్రస్తుతం సుఖ్‌లాల్ ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు.రైలు, జనసమూహాల్లో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు.

సుఖ్​లాల్ తనకు తెలిసిన కళను ప్రకృతి గడియారం అని చెబుతున్నాడు​.ఈ గడియారం తనకి మాత్రమే కనిపిస్తోందని.

మరెవరికీ కనిపించదని సుఖ్​లాల్ చెప్పడం కొసమెరుపు.దాదాపు 25 ఏళ్లుగా వాచ్ వైపు చూడకుండా టైం చెబుతూనే ఉన్నాడు ఈ ‘వాకింగ్​ మ్యాన్​ వాచ్’​.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube