Madhavi Latha CM Jagan : ఎన్ని పొత్తులున్నా జగనే సీఎం అయ్యే ఛాన్స్.. ప్రముఖ నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు జవాబు దొరకడం ఒకింత కష్టమవుతోంది.సర్వేలలో కొన్ని సర్వేలు వైసీపీకి( YCP ) అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు టీడీపీకి( TDP ) అనుకూలంగా ఉన్నాయి.

 Madhavi Latha Sensational Comments About Cm Jagan Details Here Goes Viral In So-TeluguStop.com

ఏపీ ఎన్నికల ఫలితాలను, ప్రజల ఆలోచనలను చాలా సర్వే సంస్థలు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి.అయితే బీజేపీ నేత, ప్రముఖ నటి మాధవీలత( Actress Madhavi Latha ) మాత్రం ఏపీలో జగనే సీఎం అని చెబుతున్నారు.

బీజేపీ ప్రస్తుతం జనసేన, టీడీపీలతో పొత్తులో ఉన్న నేపథ్యంలో మాధవీలత చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నా వైసీపీని ఓడించడం తేలిక కాదని ఆమె తెలిపారు.

జగన్ రాజకీయ ప్రణాళికలు ఆయనకు ఉన్నాయని వైఎస్ జగన్( YS Jagan ) ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని ఆ పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు బెనిఫిట్ కలిగిందని మాధవీలత తెలిపారు.

Telugu Actressmadhavi, Ap, Cmjagan, Madhavi Latha, Tdpbjp, Ycp-Politics

వైఎస్ జగన్ గెలుపు కోసం భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.జగన్ ను ఢీ కొట్టాలంటే చాలా జాగ్రత్తగా కష్టపడాలని ముగ్గురు పార్టీ ప్రెసిడెంట్లు కలిస్తే సరిపోదని మూడు పార్టీల కార్యకర్తలు డోర్ టు డోర్ ప్రచారం చేస్తే మాత్రమే ఫలితం మారుతుందని ఆమె తెలిపారు.ప్రజలు కూడా మూస ధోరణిలో వెళ్లిపోయే అవకాశం ఉందని మాధవీలత అన్నారు.

Telugu Actressmadhavi, Ap, Cmjagan, Madhavi Latha, Tdpbjp, Ycp-Politics

టీడీపీ, జనసేన, బీజేపీలకు( TDP Janasena BJP ) సీట్లు ముఖ్యం కాదని గెలుపు ముఖ్యమని మాధవీలత తెలిపారు.జగన్ పై కేసులు ఉన్నా ఆయనకు అదృష్టం కలిసొచ్చే ఛాన్స్ అయితే ఉందని ఆమె చెప్పుకొచ్చారు.అందరూ కలిసి కష్టపడితే మాత్రమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.మాధవీలత చేసిన కామెంట్లు కూడా నిజమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube