ఒకప్పటి హీరో మాధవన్( Madhavan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అలాగే మాధవన్ కొడుకు వేదాంత్( Vedaant ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.
గతంలో ఎన్నో రకాల అవార్డులో రివార్డులో ఘనతలు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు వేదాంత్.స్విమ్మింగ్ లో మంచి మంచి పథకాలను కూడా సాధించాడు.
ఇలా తండ్రి సినిమా రంగంలో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోగా, వేదాంత్ ఇతర రంగాల్లో రాణిస్తూ చిన్న వయసులోనే భారీగా అభిమానులను సంపాదించుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో ఆర్.
మాధవన్ తన కుమారుడిని ఇతర స్టార్స్ పిల్లలతో( Star Kids ) పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.వేదాంత్ దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఒకరు కాదు.కేవలం సెలబ్రిటీ కుమారుడు కావడంతో అతని గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నారు.
కానీ, అతనిని ఇతర సెలబ్రిటీ పిల్లలతో పోల్చడం నాకు, నా భార్య సరితకు ఇష్టం లేదు.అలాంటి వాటిని మేము అంగీకరించాలనుకోవడం లేదు.ఇప్పటివరకూ వేదాంత్ తన టాలెంట్‌తోనే విజయం సాధించాడు.ఒక నటుడి కుమారుడు జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్నాడు.
అది అంత తేలికైన విషయం కాదు.సోషల్ మీడియాలో అతనిపై వచ్చే మీమ్స్ గురించి పట్టించుకోవడం లేదు.

మీమ్స్ కారణంగా ఎదుటివారు ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయాన్ని వాటిని సృష్టించేవారు తెలుసుకోలేకపోతున్నారు అని మాధవన్ తెలిపారు.ఇకపోతే హీరో మాధవన్ విషయానికి వస్తే.ఆయన ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా నటించిన షైతాన్ చిత్రంలో( Shaitaan ) మాధవన్ నెగిటివ్ పాత్ర పోషించారు.హారర్ థ్రిల్లర్‌గా వికాశ్‌భల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో జ్యోతిక కీలక పాత్ర పోషించారు.
మార్చి 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.