MAD : మ్యాడ్ రివ్యూ అండ్ రేటింగ్!

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, డైరెక్టర్ అనుదీప్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తూ సందడి చేసినటువంటి చిత్రం మ్యాడ్( Mad ) .కళ్యాణ్ శంకర్ ( Kalyan Shankar ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.

 Mad : మ్యాడ్ రివ్యూ అండ్ రేటింగ్!-TeluguStop.com

ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ పోస్టర్స్ అమాంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని కడుపుబ్బ నవ్వించాయి.మరి ఎన్నో అంచనాల నడుమ ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది ఏంటి అనే విషయాన్ని వస్తే.

కథ: రీజినల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఇంజనీరింగ్ విద్యార్థులు.ఇక ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే ర్యాగింగ్లు ఛాలెంజ్లు క్యాంటీన్లో గొడవలు అన్నీ కూడా మామూలే అని చెప్పాలి.

ఈ సినిమాలో కూడా మొదటి సంవత్సరంలోనే ర్యాగింగ్ ఎదురు కావడం క్యాంటీన్లో ఛాలెంజ్ లు చేసుకుంటూ తమ జీవితాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వీరి జీవితాలలోకి తమ క్లాస్ మేట్స్ రాధ,జెన్నీ, ప్రియ( Radha, Jenny, Priya ) వస్తారు.

ఇంజినీరింగ్ ముగిసే సమయానికి వారి జీవితాల్లో జరిగి సంఘటనలు వారికి ఎలాంటి ఆనందాన్ని బాధలను కలిగించాయి.వారి ప్రేమను ఎలా దక్కించుకున్నారు అన్నది ఈ సినిమా కథ.

Telugu Anudeep, Mad, Narne Nithin, Ram Nithin, Review, Sangeet Shobhan, Srigauri

నటినటుల నటన: ఈ సినిమాలో నటించిన వారందరూ దాదాపు కొత్త వారే అయితే ఎవరికివారు వారి అద్భుతమైన నటనతో అందరిని మెప్పించారు.కమెడియన్ విష్ణు, సంగీత్ శోభన్ సినిమా భారాన్ని తమ భుజాలపై మోస్తే.బలమైన క్యారెక్టర్లతో రామ్ నితిన్, నార్నే నితిన్( Ram Nitin, Narne Nitin ) సినిమాకు అలా సపోర్ట్ గా నిలిచారు.ఇక ఈ సినిమాలో రవిబాబు మురళీధర్ గౌడ్ వంటి వారికి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ వీరి పాత్రకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత సంచరించుకుంది.

Telugu Anudeep, Mad, Narne Nithin, Ram Nithin, Review, Sangeet Shobhan, Srigauri

టెక్నికల్: సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్( Bheem’s Cicerolio Music ) ప్రాణంగా నిలిచింది. కేవలం పాటలు మాత్రమే కాకుండా కామెడీ సన్నివేశాలలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పాలి.సినిమాటోగ్రఫీ పనితీరు కూడా ఎంతో అద్భుతంగా ఉంది.ఇక ఎడిటింగ్ ద్వారా నవీన్ సినిమాని మరో లెవల్ కు తీసుకెళ్లారని చెప్పాలి.ఇక డైరెక్టర్ కూడా సినిమాని ఎంతో అద్భుతంగా స్క్రీన్ ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగానే ప్రయత్నాలు చేశారు.

విశ్లేషణ: కాలేజీ బ్యాక్ డ్రాప్లో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమా మాత్రం వాటికి ఎంతో భిన్నంగా మొదటి నుంచే చివరి వరకు ప్రేక్షకులకు సరైన వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసాము అన్న భావన కలిగిస్తుందని చెప్పాలి.

Telugu Anudeep, Mad, Narne Nithin, Ram Nithin, Review, Sangeet Shobhan, Srigauri

ప్లస్ పాయింట్స్: సినిమా కథ,మ్యూజిక్, నటీనటుల తీరుమైనస్ పాయింట్స్: లాజిక్ లేనటువంటి కొన్ని సన్నివేశాలు.

బాటమ్ లైన్: చివరిగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించినటువంటి మంచి కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి.

రేటింగ్: 2.75/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube