Maa Oori Polimera 2 Movie : పొలిమేర2 సినిమాలోని గుడి ఎక్కడుందో మీకు తెలుసా.. ఆ గుడిలో నిజంగానే నిధులున్నాయా?

కమెడియన్ సత్యం రాజేష్( Satyam rajesh ) తాజాగా నటించిన చిత్రం పొలిమేర 2( Maa oori polimera 2 ) గతంలో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.కాగా పార్ట్ వన్ లో మర్డర్ మిస్టరీ కి చేతబడి అంశాన్ని జత చేసి ఈ సినిమాను తెరకేక్కించారు.

 Maa Oori Polimera 2 Movie Temple Original History-TeluguStop.com

ఇక పొలిమేర పార్ట్ 2 లో ఆ విషయాలన్నీ కూడా రివీల్ చేస్తారు.జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి లింక్‌ ఉందని అక్కడ నిధులు ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక కథాంశంతో దర్శకుడు సినిమాను చాలా చక్కగా రూపొందించారు.

Telugu Andhra Pradesh, Original, Radheshyam, Satyam Rajesh, Temple, Tollywood-Mo

సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చెప్పారు.కానీ ఆ గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది.మాధవరాయ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దపు హిందూ దేవాలయం.అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఉండేది.దీనిని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.కాగా భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది.

ఈ గుడిలో రాధేశ్యామ్‌,సైరా నరసింహారెడ్డి, ఇండియన్‌-2, ( Indian 2 )మర్యాద రామన్న లాంటి సినిమాల షూటింగ్‌ అక్కడ జరిగాయి.ఇకపోతే గుడి చరిత్ర విషయానికి వస్తే.

ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాల విశ్లేషణ ఆధారంగా చూస్తే దీనిని 16 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు తెలుస్తుంది.

Telugu Andhra Pradesh, Original, Radheshyam, Satyam Rajesh, Temple, Tollywood-Mo

ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది.గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి.16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి.పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ అనగా కృష్ణుడికి నమస్కరించి, దేవుడికి మాల సమర్పించారని పేర్కొంది.మరి నిజంగానే ఆ గుడిలో నిధులు ఉన్నాయా అంటే మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది.

ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి.దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు.

ఊరికి దూరంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్‌ ఉందని గుడికి లాక్‌ చేసి ఉంచుతారు.టూరిస్ట్‌లు వెళ్లిన సమయంలో గేట్లు తెరుస్తారు.స్థానికులు చెబుతున్న ప్రకారం ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని మహ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెప్పుకొస్తున్నారు.కానీ గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు కనిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube