వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

 Low Pressure In Northwest Bay Of Bengal.. Rains In Uttarandhra-TeluguStop.com

మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

అదేవిధంగా మత్స్యకారులు మరో రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారులు వెల్లడించారు.కాగా ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube