ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీకు లోబీపీ ఉన్న‌ట్టే..జాగ్ర‌త్త!

లోబీపీ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.బీపీ ఉండాల్సిన దానికంటే త‌క్కువ‌గా ఉండ‌ట‌మే లోబీపీ అని అంటారు.

లోబీపీ చిన్న స‌మ‌స్యే అని భావించి చాలా మంది నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.ఇదే పొర‌పాటు.

లోబీపీ చిన్న స‌మ‌స్యే కావొచ్చు.కానీ, నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంది.

అలాగే చాలా మంది త‌మ‌కు లోబీపీ ఉంద‌ని గుర్తించ‌లేక రిస్క్‌లో ప‌డుతున్నారు.కానీ, లోబీపీ ఉందా లేదా అన్నది కొన్ని కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

Advertisement

ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆహారం తీసుకున్నా కొంత స‌మ‌యానికే నీర‌స ప‌డిపోతుంటారు.

ఇలా ఒక‌టి, రెండు సార్లు జ‌రిగితే.ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

కానీ, త‌ర‌చూ ఇలానే జ‌రిగితే ఖ‌చ్చితంగా లోబీపీ అని అనుమానించాల్సిందే.అలాగే త‌ల‌నొప్పి కూడా లోబీపీ ల‌క్ష‌ణ‌మే.

గభాల్న లేచి నిలబడ్డప్పుడు కళ్ళు బైర్లు కమ్మటం, స్పృహ తప్పటం లాంటివి జ‌రిగినా లోబీపీ అవ్వొచ్చు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

లోబీపీ ఉన్న‌ప్పుడే త‌ర‌చూ ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.ఇక అల‌స‌ట ఎక్కువ‌గా ఉంటుంది.చిన్న చిన్న ప‌నుల‌కే అల‌సిపోతుంటారు.

Advertisement

దాంతో ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.ఇలా జ‌రిగినా లోబీపీ ఉన్న‌ట్టే అని భావించాలి.

త‌‌ల‌నొప్పి కూడా లోబీపీ ల‌క్ష‌ణ‌మే.అంతేకాకుండా త‌ర‌చూ వికారంగా ఉండ‌టం, క‌ళ్లు మ‌స‌క బార‌టం, మూర్ఛ, గుండె ద‌డ‌గా ఉండ‌టం కూడా లోబీపీ ల‌క్ష‌ణాలే.

ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్పుడు ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించి ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే కొన్ని కొన్ని చిట్కాల‌ను కూడా ఫాలో అయితే లో బీపీని సుల‌భంగా కంట్రోల్ చేసుకోవ‌చ్చు.

ఇక మగవారితో పోల్చితే మహిళల్లో లోబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది.ప్రెగ్నెన్సీ సమయంలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల‌, జాగ్ర‌త్త‌గా ఉండాలి.లేదంటే ప్రాణాలనే కోల్పోవాల్సి వ‌స్తుంది.

తాజా వార్తలు