జులైలో ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్‌ లు వస్తే.. ఆ తర్వాత సందడే సందడి

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల మార్చి ఏప్రిల్‌ లో విడుదల అవ్వాల్సిన సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి.

మే జూన్‌ నెలల్లో అయినా సినిమాలు విడుదల అవుతాయేమో అనుకుంటే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.

మూడు నెలలకు పైగా థియేటర్లు మూత పడటంతో సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఒకటి రెండు చిన్నా చితకా సినిమా లు ఓటీటీ ల ద్వారా వచ్చినా కూడా పూర్తి స్థాయి లో సిమాలు మాత్రం రాలేదు.

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నిలిచి పోయిన సినిమాల జాబితాలో మొదట ఉండే మూడు క్రేజీ సినిమా లు ఏంటీ అంటే నాగచైతన్య మరియు సాయి పల్లవి నటించిన లవ్‌ స్టోరీ ఒకటి కాగా నాని మరియు రీతూ వర్మ జంటగా రూపొందిన టక్ జగదీష్‌ సినిమా రెండవది.ఈ రెండు సినిమా లతో పాటు దిల్‌ రాజు నిర్మించిన పాగల్‌ సినిమా కూడా విడుదల వాయిదా పడింది.

ఈ మూడు సినిమాలు సెకండ్‌ వేవ్‌ తర్వాత టాలీవుడ్‌ ను పునః ప్రారంభించబోతున్నాయి.

Advertisement

ఈ మూడు సినిమాల విడుదల తేదీలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లవ్‌ స్టోరీ సినిమా ను ఎప్పుడు థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే అప్పుడు వెంటనే విడుదల చేస్తానంటూ నిర్మాత అధికారికంగా ప్రకటించాడు.లవ్‌ స్టోరీ సినిమా కు ఉన్న బజ్‌ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టడం ఖాయం అంటున్నారు.

ఇక నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వం లో గతంలో వచ్చిన నిన్ను కోరి సినిమా కు మంచి టాక్ దక్కింది.కనుక వీరి కాంబోలో రూపొందిన టక్ జగదీష్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకంగా ఉన్నారు.

ఇదే సమయంలో పాగల్ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో వ్యక్తం చేస్తున్నారు.ఈమూడు సినిమా లు కూడా జులై లో విడుదల అయితే ఖచ్చితంగా ఆగస్టులో మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు