ప్రేమలోని మాధుర్యాన్ని చూపించిన 'విక్కీ ది రాక్ స్టార్' లవ్ షేడ్

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది.హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 Love Shade Released From Vikky The Rockstar Movie Details, Vikky The Rockstar ,-TeluguStop.com

సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు.భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా.

పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది.

విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌‌కు మంచి స్పందన వచ్చింది.సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా లవ్ షేడ్‌ను విడుదల చేశారు.‘ఎంత బాగుందో.

ఇలా నీ పక్కన ఉండటం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంది.ఐ వాంట్ టు స్టే ఫరెవర్’ అంటూ అంటూ సాగే ఈ లవ్ షేడ్‌లో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు.

ఇందులో రొమాంటిక్ సీన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.ఇందులో సునీల్ కశ్యప్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్.

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో, ఫస్ట్ షేడ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి.

ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది.అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

సాంకేతిక వర్గం

రచన & దర్శకత్వం : సిఎస్ గంటా, బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్, నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సుభాష్, చరిత, సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్ , ఎడిటర్: ప్రదీప్ జంబిగా , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర, డిజైనర్: TSS కుమార్, పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube