చైనీస్ ఫుడ్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది రెండు రకాలు.ఒకటి నూడిల్స్ అయితే రెండోది మంచూరియా.
( Manchurian ) అవును, ఈ రెండిటినీ మనవాళ్లు కూడా లొట్టలేసుకొని మరీ అరగిస్తారు.మరీ ముఖ్యంగా మంచూరియా అంటే చాలా మంది ఇష్టపడతారు.
అందులో ఎక్కువగా మన ఆడవాళ్ళు వుంటారు.వెజ్, నాన్-వెజ్ వంటలతో కలిపి అమ్మే మంచూరియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి.ఈ మంచూరియాను డ్రైగా కొంతమంది తింటే, గ్రేవీతో కలిపి కొంతమంది తింటూ వుంటారు.నిజానికి మంచూరియాను ఇంట్లోనే తయారు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ మనకి బద్దకం కదా.అందుకే వివిధ షాపులకి దగ్గరికి వెళ్ళి మరీ తింటాము.
అయితే వీటిని క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, సెనగ పిండి, ఉప్పు, నూనె వంటి పదార్థాలను ఉపయోగించి సులభంగా వండవచ్చు.అయినా మనవాళ్లు చాలా మంది రోడ్డు పక్కన స్టాల్స్ దగ్గర తినేందుకే ఇష్టపడతారు.ఇక రోడ్డు పక్కన స్టాల్స్‌పై లభించే మంచూరియా టేస్టీగా ఉన్నప్పటికీ, దానిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా ఆలోచించారా? మంచూరియా తయారీ విధానంలో పాటించే శుభ్రత( Cleanliness ) గురించి మీరు పట్టించుకుంటే, మీరు వారు చేసిన మంచూరియా అస్సలు నోట్లోనే పెట్టలేరు.
అవును, ప్రస్తుతం సూరత్‌లోని( Surat ) ఓ ఫ్యాక్టరీలో 500 కేజీల మంచూరియాను తయారు చేస్తుండగా తీసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.ఈ వీడియోలో క్యాబేజీలను కట్ చేయడం దగ్గర్నుంచి, పిండి కలపడం, వేయించడం వరకు ఎక్కడా పరిశుభ్రత అనేది కనీసం పాటించలేదు.మంచూరియను తయారు చేసే కార్మికులు ఎవరూ చేతులకు గ్లౌస్ ధరించి లేకపోవడం ఇక్కడ మనం చూడవచ్చు.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ కాగా నెట్టింట పెద్ద రాద్దాంతమే అవుతోంది.
ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.