గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు

కొందరికి గోర్లు కత్తిరించడానికి నెల్ కట్టర్ అవసరం లేదు.దంతాలతోనే గోర్లు కట్ చేసేస్తారు.

ఇక చాలామందికి గోర్లు కొరకడం అలవాటు.బోర్ కొట్టడం వలన కావచ్చు, ఏదైనా టెన్షన్ కి లోనయినప్పుడు కావచ్చు, అసలు ఏ కారణం లేకుండా ఊరికే కోరికేయడం కావచ్చు, ఎలా చేసినా, ఎందుకు చేసినా ఇది మంచి అలవాటు మాత్రం కాదు.

ఎందుకంటే .* అందరికి అర్థమయ్యే సాధారణ కారణం గోటిలోని మురికి శరీరంలోనికి పోవడం.Salmonella and E.coli లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి బాడిలోకి వెళుతుంది.* గోర్లు కొరకడం వలన paronychia లాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

*ఈ అలావాటు కూడా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు.* గోర్లు కొరకడం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు.

Advertisement

ఇది ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కూడా అపదలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంటారు.* ఓరల్ సమస్యలు, దురదృష్ణం ఎక్కువైతే క్యాన్సర్ ని కూడా మోసుకొస్తుంది ఈ అలవాటు.

కాబట్టి గోర్లు కొరకడం ఆపండి.

Advertisement

తాజా వార్తలు