కామ్నా జఠ్మలానీ ( Kamna Jathmalani ) ఈ పేరు విడుగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా రణం. గోపీచంద్ ( Gopichand )హీరోగా నటించిన రణం సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది కామ్నా జఠ్మలానీ.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది.తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పూర్తిస్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం రణం( Ranam ) సినిమానే అని చెప్పవచ్చు.
అయితే కుర్రాళ్ళ కలల రాణిగా ఉన్న కామ్నా జఠ్మలానీకి ఇప్పుడు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.
కాగా 2005లో విడుదలైన ప్రేమికులు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది కామ్నా జఠ్మలానీ.అందుకు రణం మూవీతో బ్రేక్ వచ్చింది.దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
రణం సూపర్ హిట్ అయ్యింది.అనంతరం టాలీవుడ్ తో పాటు ఆమెకు సౌత్ లో ఆఫర్స్ పెరిగాయి.
తమిళ్, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది.కామ్నా జఠ్మలానీ నటించిన మరో హిట్ మూవీ బెండు అప్పారావు( Bendu Apparao ).సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్.కామ్నా జఠ్మలానికి బ్రేక్ ఇచ్చే మూవీ పడింది.
బెండు అప్పారావు చిత్రానికి ఈ వి వి సత్యనారాయణ దర్శకుడు.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.బెండు అప్పారావు మంచి విజయం సాధించింది.కామ్నా కెరీర్ కి ఏమంత బూస్ట్ ఇవ్వలేదు లేదు ఆ చిత్రం.అనంతరం అల్లరి నరేష్ కి జంటగా యాక్షన్ త్రీడి, భాయ్ చిత్రాలు చేసింది.అవి డిజాస్టర్స్ అయ్యాయి.
తెలుగులో కామ్నా చివరి చిత్రం వ్యవస్థ.ఇది నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది.
కామ్నా నటనకు ప్రశంసలు దక్కాయి.కామ్నా 2014లో సూరజ్ నాగ్ పాల్( Suraj Nag Pal ) అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు.ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కామ్నాకు ఇంత పెద్ద కూతుళ్లు ఉన్నారా అని జనాలు ఆశ్చర్య పోతున్నారు.పిల్లలిద్దరూ కూడా ఎంతో క్యూట్గా అచ్చం తల్లి పోలికలతో చాలా అందంగా ఉన్నారు.