నార్త్ లండన్‌లోని( North London ) ఒక కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్‌కు బ్రిటీష్ ఇండియన్ గూఢచారి, టిప్పు సుల్తాన్ ( Tipu Sultan )కుటుంబానికి చెందిన రాజవంశీకురాలు నూర్ ఇనాయత్ ఖాన్ ( Noor Inayat Khan )పేరు పెట్టారు.ఈ ప్రాంతంలోని స్థానికుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బ్యాలెట్ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక లేబర్ పార్టీ ఎంపీ, విపక్ష నేత కైర్ స్టార్మర్, ఇనాయత్ ఖాన్ జీవిత చరిత్ర రాసిన శ్రబానీ బసు, క్యామ్‌డెన్ కౌన్సిల్ నాయకులు, ప్రజలు ‘‘నూర్ ఇనాయత్ ఖాన్ హౌస్’’ని బుధవారం ఆవిష్కరించారు.

బ్రిటన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌వోఈ) కోసం రహస్య రేడియో ఆపరేటర్‌గా నియమించబడిన తర్వాత 1943లో నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌కు వెళ్లేముందు నూర్ తన కుటుంబంతో కలిసి కామ్‌డెన్‌లో నివసించారు.2012లో నూర్ ఇనాయత్ ఖాన్ మెమొరియల్ ట్రస్ట్ .గోర్డాన్ స్క్వేర్ వద్ద ఖాన్ ఆమె స్మారకాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం 2020లో ఇంగ్లీష్ హెరిటేజ్ ఛారిటీ.బ్లూమ్స్‌బరీలోని 4 టావిటన్ స్ట్రీట్‌లో కామెడెన్‌లోని ఆమె ఇంట్లో బ్లూ ప్లేక్‌ను ఆవిష్కరించింది.

ఎవరీ నూర్ ఇనాయత్ .?
బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్ మహిళా విభాగంలో ఇనాయత్ విశేష సేవలు అందించారు.అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనూ విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించారు.1914లో మాస్కోలో జన్మించారు నూర్ ఇనాయత్.ఈమె తండ్రి భారతీయ సూఫీ సన్యాసి కాగా.తల్లి అమెరికన్ మహిళ.నూర్ చిన్నతనంలోనే వీరి కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది.అనంతరం ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ పరాజయం పాలవ్వడంతో నూర్ ఇంగ్లాండ్‌కు చేరుకుని బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్( British Air Force ) మహిళా విభాగంలో చేరారు.నిఘా, గూఢచార్యం నిమిత్తం ఏర్పాటు చేసిన ఎస్‌వోఈ విభాగంలో చేరారు.
అంతేకాదు.అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఫ్రాన్స్‌పై నిఘా నిమిత్తం నియమించిన తొలి మహిళా గూఢచారిగా ఇనాయత్ రికార్డు సృష్టించారు.
ప్రమాదకర పరిస్ధితుల్లో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచినందుకు గాను ప్రతిష్టాత్మక జార్జ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్నారు.ఆర్ఏఎఫ్ ఉమెన్స్ యాక్సిలరీ ఎయిర్‌ఫోర్స్ (డబ్ల్యూఏఏఎఫ్)లో జార్జ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్న ఇద్దరిలో ఒకరుగా ఇనాయత్ చరిత్రలో నిలిచిపోయారు.







