పంచాయితీల నిధుల దొంగ అంటూ లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం లో సాగుతోంది.ఇప్పటికే 200 రోజులు పాదయాత్ర చేసిన లోకేష్ 2700 కిలోమీటర్లకు పైగా నడవటం జరిగింది.

 Lokesh's Serious Comments Saying That Jagan Is A Prostitute Tdp, Nara Lokesh,-TeluguStop.com

ఈ క్రమంలో గోపాలపురం నియోజకవర్గం చీపురుగూడెం గ్రామంలో రోడ్లపై గొంతుల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో నాట్లు వేసి లోకేష్ నిరసన వ్యక్తం చేశారు.వైయస్ జగన్ పాలనలో రోడ్లు దుర్భరంగా తయారయ్యాని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్( CM jagan ) ముఖం చూసే రోడ్లు వేయటానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడంలేదని పేర్కొన్నారు.ఈ క్రమంలో జగన్ దొంగ అంటూ లోకేష్ ట్విట్టర్ లో సంచలన ట్వీట్ పెట్టారు.

“పంచాయితీల నిధుల దొంగ జగన్ రెడ్డి! ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు( N Chandrababu Naidu )కు కృతజ్ఞతలు చెబుతూ 2017లో నల్లజర్ల ప్రజలు ఏర్పాటు చేసిన శిలాఫలకం.గత ప్రభుత్వ హయాంలో నూరుశాతం సిమెంటు రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పింఛన్లు, ఆహార భద్రత, ఎల్ఇడి వీధి దీపాలు, గ్యాస్ సిలెండర్లు అందజేసి నల్లజర్లను స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దాం.

రాష్ట్రప్రభుత్వం నుంచి మేం అదనపు నిధులిచ్చి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే, పంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన 14,15 కమిషన్ ఫైనాన్స్ నిధులు 9వేల కోట్లు దొంగిలించాడు గజదొంగ జగన్ రెడ్డి”.అని లోకేష్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube