ఆగస్టు 22వ తారీకు మంగళవారం గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ భారీ బహిరంగ సభ( TDP Meeting Gannavaram Constituency ) నిర్వహించడం జరిగింది.ఈ భారీ బహిరంగ సభలో ఉమ్మడి కృష్ణ జిల్లా తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సభలో నారా లోకేష్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సన్న బియ్యం సన్నాసి అంటూ సెటైర్లు వేశారు.
పేకాట క్లబ్బులు, గుట్కా పైన తప్ప మిగతా వాటిపై అవగాహన లేదు అని విమర్శించారు.రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని నా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించి పెద్ద తప్పు చేశాడు.
అటువంటి వ్యక్తికి చెబుతున్న మరో తొమ్మిది నెలల్లో వచ్చేది తెలుగుదేశమే.కట్ డ్రాయర్ మీద గుడివాడ( Gudivada )లో ఊరేగించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అని హెచ్చరించారు.
ఇంకొక్కసారి మరో తల్లిని అవమానించాలనుకున్న.పేరు ఎత్తాలి అనుకున్న.
ఉచ్చ పోసే విధంగా చేస్తానంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఇదే సభలో వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి జోగి రమేష్ పై మండిపడ్డారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట.ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీయే అని లోకేష్ వ్యాఖ్యానించారు.
అటువంటి ఈ గన్నవరం నియోజకవర్గంలో మేము చేసిన తప్పు వల్ల.పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు అంటూ వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
నేను మంత్రిగా ఉన్న సమయంలో నా ఛాంబర్ లోకి వచ్చినప్పుడు.సార్ సార్ అని అంటున్నప్పుడు.
కూర్చోమంటే మీ ముందు నేను నిలబడే ఉంటాను అని వ్యవహరించిన వ్యక్తి.ఈ మహానటుడు.
ఏకంగా మూడుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈ పిల్ల సైకో.ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు.2012లో సన్న బియ్యం సైకో ఆ తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ పార్టీ విడిపోవడంతో.కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి దరిద్రం పోయింది అని లోకేష్ గన్నవరం సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.