యుద్ధంలో నాతో చేరాలని లోకేష్ పిలుపు ! మద్దతు పలికిన ఆ హీరో

టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ కావడం,  ఆయనను కోర్టులో ప్రవేశపెట్టడం, ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో,  ఈరోజు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.చంద్రబాబు అరెస్టు ను నిరసిస్తూ ఎక్కడకక్కడ టిడిపి శ్రేణులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.

 Lokesh S Call To Join Me In The War! That Hero Who Supported Tdp, Chandrababu,-TeluguStop.com

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు,  టిడిపి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన కుమారుడు , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తన తండ్రి ఎప్పుడు చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుంటుందని , రక్తం మరుగుతోందని , కక్ష సాధింపు చర్యలు , స్వార్థ  రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని లోకేష్ ( Nara Lokesh )ట్వీట్ చేశారు.దేశం , రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని లోకేష్ ప్రశ్నించారు.  నేను చంద్రబాబు నుంచి ప్రేరణ పొంది,  అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్ కు తిరిగివచ్చా? ఇది కఠినమైన నిర్ణయం.నాకు మన దేశం వ్యవస్థలు అన్నిటికీ మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

ఈరోజు ద్రోహంలా అనిపిస్తోంది.మా నాన్న పోరాట యోధుడు.

నేను కూడా అంతే.

ఏపీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం తిరుగులేని శక్తితో మేము ఎదుగుతాం.ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా అంటూ లోకేష్ ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.దీనిపై ప్రముఖ సినీ హీరో చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్( Nara rohith ) స్పందించారు .అన్యాయం ఎక్కువ కాలం నిలవదు కానీ సత్యం శాశ్వతంగా ఉంటుంది.దీనితో పోరాడుదాం నారా లోకేష్ అన్నా అంటూ నారా రోహిత్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube