ఖుషి, శెట్టి రెండు సినిమాలకు అదే పరిస్థితి

భారీ అంచనాల నడుమ వారం గ్యాప్ తో వచ్చిన రెండు సినిమా లు ఖుషి( Kushi ) మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి.కానీ కలెక్షన్స్‌ విషయం లో రెండు సినిమా లు కూడా నిరాశ పరిచాయి.

 Kushi And Miss Shetty And Mister Polishetty Movie Collections,kushi , Miss Shett-TeluguStop.com

ముఖ్యంగా ఖుషి సినిమా ఈజీగా వంద కోట్లు అనుకుంటే మొదటి వారం రోజుల తర్వాత జనాలు కనిపించడం లేదు.ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా( Miss Shetty Mister Polishetty ) కు వచ్చిన టాక్ నేపథ్యం లో గౌరవ ప్రథమైన వసూళ్లు నమోదు అవుతాయని అంతా అనుకున్నారు.

కానీ అనుకున్న స్థాయి లో వసూళ్లు నమోదు అవ్వడం లేదు.

కొన్ని సినిమా లు వసూళ్ల పరంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ఆ మధ్య బేబీ( Baby Movie ) చిన్న సినిమా అయినా కూడా దాదాపుగా వంద కోట్ల వసూళ్ల ను నమోదు చేసింది.ఇక ఆ స్థాయి లో వసూళ్లు నమోదు చేస్తుందా అంటే కష్టమే అన్నట్లుగా ఈ రెండు సినిమా లు నిలిచాయి.

ఈ రెండు సినిమా లు కూడా బ్రేక్ ఈవెన్‌ కి ముందు నిలిచి పోయాయి.భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకుంటే ఇలా అయిందేంటి అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు.

నవీన్ పొలిశెట్టి మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు సమయం కేటాయించాడు.

ఖుషి సినిమా సమంత వల్ల ఏడాది ఆలస్యం అయింది.ఇద్దరు హీరోలు తమ రెగ్యులర్‌ సినిమా ల కంటే ఈ సినిమా లకు ఎక్కువ సమయం కేటాయించారు.అయినా కూడా ఫలితం దక్కక పోవడం తో వారి వారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా ఈ హీరోలు విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube