ఏపీలో టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.ఈ మేరకు ఈనెల 24 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ కావడంతో లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు సుమారు 2852.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వద్ద పాదయాత్ర ఆగిపోయింది.
అయితే యువగళం పాదయాత్రను విశాఖలో ముగించాలని లోకేశ్ భావిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్రను ముగించే అవకాశం ఉందని సమాచారం.