మాస్ లీడర్ గా ఎదుగుతున్న లోకేష్!

తెలుగుదేశం పార్టీ( TDP ) రాజమహేంద్రవరం వేదికగా ఘనంగా నిర్వహించుకుంటున్న మహానాడు కార్యక్రమం( Mahanadu ) ముగిసింది .అయితే ఈ మొత్తం కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా లోకేష్ స్పీచ్ ఉందని వార్తలు వచ్చాయి.

 Lokesh Turning Into A Mass Leader Details, Lokesh, Nara Lokesh, Tdp, Tdp Mahanad-TeluguStop.com

కార్యక్రమం లో ఆయన ఎంట్రీ లోనే ఆయన అభిమానులు ఒక రేంజ్ లో హంగామా చేశారని తెలుస్తుంది .యువగళం పాదయాత్ర( Yuvagalam ) తరువాత ఆయన కొత్త అభిమానులను సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది .పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత లోకేష్ ( Nara Lokesh ) ఇమేజ్ లో భారీ మార్పులు వచ్చినట్లుగా అర్దం అవుతుంది .

అంతకు ముందు వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న లోకేష్ కేవలం నాయకులు లో మాత్రమే గౌరవం కలిగి ఉండేవాడు.అయితే పాదయాత్ర ద్వారా రాజకీయ పరిణితి ని సాధించిన లోకేష్ తన వాగ్బానాలతో అధికార పార్టీని ఇరుకును పెడుతున్నారు.కార్యకర్తలతో ఆయన ఎంతగా మమేకమయ్యారో ఆయనకు లభించిన గ్రాండ్ వెల్కమ్ ద్వారా అర్థమవుతుంది.

తెలుగుదేశం భవిష్యత్తు సారధి తానేనని పార్టీ తన సారుద్యంలోనే ముందుకు వెళ్తుంది అనే స్పష్టమైన సంకేతాలను మహానాడు వేదికగా ఆయన ఇచ్చారని తెలుస్తుంది .

Telugu Ap, Chandrababu, Cmjagan, Lokesh, Tdp Mahanadu, Tdp-Telugu Political News

కష్టపడి పని చేయకపోతే తనతో సహా ఎవరికి టికెట్లు దక్కవని, కష్ట కాలం లో పార్టీని వదిలి వెళ్ళి ఇప్పుడు తిరిగి వచ్చి సీటు కోరె వా రెవరికి టికెట్లు ఇవ్వమని చంద్రబాబు సమక్షంలోనే స్పష్టం చేసిన లోకేష్ ఇక సీట్ల ఎంపికలో తనది ముఖ్యమైన పాత్ర అని స్పష్టం చేసేసారు .కార్యకర్తకు ఇబ్బంది కలిగితే ఒక్క నిమిషం కూడా మీ లోకేష్ ఆగడని ,అమలాపురం నుంచి అమెరికా వరకు ఎవరినైనా సరే పట్టుకొచ్చి లోపల వేస్తామని హెచ్చరించిన లోకేష్ పోరాటం పసుపు సైన్యం బ్లడ్ లో ఉందని ఇచ్చిన స్పీచ్ కు తెలుగుదేశం కార్యకర్తలు పులకించిపోయారని తెలుస్తుంది.

Telugu Ap, Chandrababu, Cmjagan, Lokesh, Tdp Mahanadu, Tdp-Telugu Political News

అంతేకాకుండా జగన్ పై విమర్శలు పదును పెంచిన లోకేష్ లక్ష రూపాయల చెప్పులు వేసుకునేవాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు, పేదవాడ కాదని వచ్చే ఎన్నికలు పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య యుద్ధంగా అభివర్ణిస్తున్న జగన్ దేశం మొత్తం మీద అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నాడు అంటూ జగన్ టార్గెట్గా ఆయన ఇచ్చిన స్పీచ్ ఆహుతులను ఆకట్టుకుందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube