టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh, )ప్రస్తుతం యువ గళం పాదయాత్రతో బిజీగా ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో టిడిపి శ్రేణులు అందరిని యాక్టివ్ చేయడంతో పాటు, తనను టిడిపిలో బలమైన నాయకుడిగా గుర్తించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడుతూ, చంద్రబాబు తర్వాత ఆ స్థాయి వ్యక్తిగా ముద్ర వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక రాబోయే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో లోకేష్ ఉన్నారు.

ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓటమి చెందిన మంగళగిరి నియోజకవర్గం నుంచి 2024 నుంచి పోటీ చేసి గెలుస్తానని లోకేష్ బలంగా నమ్ముతున్నారు.దానికి తగ్గట్లుగానే అక్కడ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేపట్టారు.అనేక సేవా కార్యక్రమాలు లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ నియోజకవర్గంలో వైసిపి ( ycp )కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడం లోకేష్ ను ఓడించేందుకు అనేక రకాలుగా స్కెచ్ లు వేస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది.అయితే మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు పై లోకేష్ లో కూడా అనుమానాలు పెరిగిపోతున్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక్కడ గెలవకపోతే తాను అసెంబ్లీలో ఏ విధంగా అడుగు పెట్టాలి అనే టెన్షన్ లో ఉన్నారట.

అందుకే మంగళగిరి తో పాటు మరో నియోజకవర్గంలో నుంచి పోటీ చేసేందుకు లోకేష్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అనంతపురం జిల్లాలోని కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందని విషయంపై ప్రస్తుతం ఆలోచనలు పడ్డారట మంగళగిరిలో ఓడినా, కళ్యాణదుర్గంలో గెలుస్తాననే నమ్మకంతో లోకేష్ ఉన్నారట.అందుకే రెండో ఆప్షన్ ను పరిగణలోకి తీసుకున్నారట.
అమరావతి లో పట్టు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది.అలాగే 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అమరావతి( Amaravati )లో కేటాయించడం, దీనికి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చంద్రబాబు సైతం ఆలోచనలో పడ్డారట .అమరావతి కేటాయించిన ఇళ్ల స్థలాలో మంగళగిరి నియోజకవర్గానికి చెందినవారు చాలామంది ఉండడంతో , వారంతా వైసీపీ కి అనుకూలంగా మారితే తన గెలుపుకు ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో లోకేష్ రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నారట.అయితే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో పూర్తిగా టిడిపికి పట్టులేదు .అయినా లోకేష్ ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు .








