కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) ఒకరు.ఈ యంగ్ డైరెక్టర్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తీసిన ప్రతీ సినిమాను సూపర్ హిట్ చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు.
వరుస సక్సెస్ లలతో దూసుకు పోతున్న ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ లో మాస్టర్, ఖైదీ, కమల్ తో విక్రమ్ సినిమాలు తీసి హ్యాట్రిక్స్ సక్సెస్ లను అందుకున్నాడు.

మూడు కూడా కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి.తన యూనివర్స్ లో ఒక సినిమాను మరో సినిమాకు లింక్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.మరి ఇప్పుడు ఈ డైరెక్టర్ ఇళయ దళపతి విజయ్( Ilayathalapathy Vijay )తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
మాస్టర్ తర్వాత మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం వీరి కాంబోలో ‘లియో'( Leo ) సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా తన సినిమాలు అన్ని కూడా నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్న లోకేష్ తెలుగు హీరోలపై కూడా కన్నేశాడు.
మరి మన తెలుగులో లోకేష్ ప్రభాస్( Lokesh-Prabhas ) తో సినిమా చేయబోతున్నాడు అని బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ లైనప్ లో ప్రభాస్ తో పాటు, రామ్ చరణ్ పై కూడా రూమర్స్ ఉన్నాయి.మరి ఈ వార్తల్లో ప్రభాస్ తో చేసే సినిమాపై లోకేష్ స్పందించారు.ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ తో తాను ఎప్పుడు టచ్ లో ఉన్నానని.ఇప్పుడు తాము ఇద్దరం కూడా వరుస ప్రాజెక్టులతో చిత్రాలతో కొన్నాళ్ల పాటు బిజీగా ఉంటామని ఆ తర్వాత తప్పకుండ సినిమా ఉంటుందని గ్యారెంటీ ఇచ్చాడు.
దీంతో ఈ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.







